IND vs SA 1st test Gambhir slammed as India field 6 left handed stars
IND vs SA : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో (IND vs SA) భారత తుది జట్టు కూర్పు చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఎడమ చేతి వాటం ఆటగాళ్లు ఆడుతున్నారు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్‌లో ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఆడడం ఇదే తొలిసారి.
యశస్వి జైశ్వాల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ లు లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్లు అన్న సంగతి తెలిసిందే. ఇక టాప్-8లో చూసుకున్నా సరే ఐదుగురు ఎడమ చేతి వాటం ఆటగాళ్లు ఉన్నారు.
IND vs SA : బుమ్రా పాంచ్ పటాకా.. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159 ఆలౌట్..
గతంలో ఎన్నడూ కూడా నలుగురి కంటే ఎక్కువ మంది ఎడమ చేతివాటం ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో ఆడలేదు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాతనే ఎక్కువ మంది ఎడమ చేతి వాటం ఆటగాళ్లకు చోటు ఇస్తున్నాడని పలువురు బహిరంగంగా కామెంట్లు చేస్తున్నాడు. స్వతహాగా గంభీర్ ఎడమ చేతి వాటం ఆటగాడు కావడమే ఇందుకు కారణం అని చెబుతున్నారు.
ఏదీఏమైనప్పటికి గతంలో మూడు సందర్భాల్లో మాత్రమే భారత జట్టు ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లతో టెస్టులు ఆడింది. ఈ మూడు మ్యాచ్‌లు కూడా ఈ ఏడాదే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
అత్యధిక లెఫ్ట్ హ్యాండర్లతో భారత్ ఆడిన టెస్టులు ఇవే..
* కోల్‌కతా వేదికగా 2025లో దక్షిణాఫ్రికాపై – 6 గురు (ప్రస్తుత మ్యాచ్)
* మాంచెస్టర్ వేదికగా 2025లో ఇంగ్లాండ్ పై – 5 గురు
* అహ్మదాబాద్ వేదికగా 2025లో వెస్టిండీస్ పై – 5 గురు
* ఢిల్లీ వేదికగా 2025లో వెస్టిండీస్ పై – 5గురు
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు భారత తుది జట్టు ఇదే..
యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
A look at #TeamIndia‘s Playing XI 🙌
Updates ▶️ https://t.co/okTBo3qxVH#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/i7UcpmmkF7
— BCCI (@BCCI) November 14, 2025