Jasprit Bumrah : రవిచంద్రన్ అశ్విన్ రికార్డు బ్రేక్.. ఎలైట్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్న బుమ్రా..
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
IND vs SA 1st Test Jasprit Bumrah surpasses Ashwin in elite list
Jasprit Bumrah : టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో సఫారీ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా (Jasprit Bumrah)ఈ జాబితాలో చోటు సంపాదించాడు.
ఈ మ్యాచ్‌లో రికెల్టన్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌల్డ్‌ల రూపంలో అత్యధిక మంది బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను అధిగమించాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలు మాత్రమే బుమ్రా కన్నా ముందు ఉన్నారు.
Kuldeep Yadav : పెళ్లి చేసుకుంటానయ్యా.. సెలవు ఇవ్వండి.. బీసీసీఐకి కుల్దీప్ యాదవ్ రిక్వెస్ట్.. !
అంతర్జాతీయ క్రికెట్‌లో అశ్విన్ 151 సార్లు బ్యాటర్లను క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేర్చగా.. తాజా వికెట్‌తో బుమ్రా 152 సార్లు ఈఘనత సాధించాడు. ఇక కపిల్ దేవ్ 167 సార్లు, అనిల్ కుంబ్లే 186 సార్లు ఈ ఘనత అందుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాటర్లను అత్యధిక సార్లు క్లీన్‌బౌల్డ్ చేసిన భారత బౌలర్లు వీరే..
* అనిల్ కుంబ్లే – 186
* కపిల్ దేవ్ – 167
* జస్‌ప్రీత్ బుమ్రా – 152*
* రవిచంద్రన్ అశ్విన్ – 151
* రవీంద్ర జడేజా – 145
