IND vs SA 1st Test Team India all out 159 in 1st innings
IND vs SA : కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్లు నిరాశపరిచారు. దీంతో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు కేవలం 30 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది.
37/1 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 152 పరుగులు జోడించి మిగిలిన 9 వికెట్లను చేజార్చుకుంది. భారత బ్యాటర్లలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (39; 119 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్స్). వాషింగ్టన్ సుందర్(29), రవీంద్ర జడేజా(27), రిషబ్ పంత్(27) లు తమకు లభించిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.
Innings Break!#TeamIndia have secured a lead of 3⃣0⃣ runs in the first innings 👍
Over to our bowlers in the second innings!
Scorecard ▶️ https://t.co/okTBo3qxVH #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/pyAO3XPGfA
— BCCI (@BCCI) November 15, 2025
యశస్వి జైస్వాల్ (12), ధ్రువ్ జురేల్ (14) లు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీశాడు. మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహరాజ్, కోర్బిన్ బోష్ చెరో వికెట్ సాధించారు. అంతకముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
గిల్ రిటైర్డ్ ఔట్..
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. హార్మర్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో గిల్ మెడ పట్టేసింది. ఫిజియో వచ్చి చికిత్స అందించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. ఆ తరువాత భారత్ వికెట్లు కోల్పోయినప్పటికి అతడు బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో అతడి రిటైర్డ్ ఔట్‌గా పరిగణించారు.
🚨 Update 🚨
Shubman Gill has a neck spasm and is being monitored by the BCCI medical team. A decision on his participation today will be taken as per his progress.
Updates ▶️ https://t.co/okTBo3qxVH #TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/ivd9LVsvZj
— BCCI (@BCCI) November 15, 2025
గిల్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. గాయం తీవ్రత తెలిసిన తరువాత అతడి పై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చింది.