Rishabh Pant : చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌.. టెస్టుల్లో భార‌త సిక్స‌ర్ల కింగ్.. సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్‌..

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్‌, బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ (Rishabh Pant) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Rishabh Pant : చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌.. టెస్టుల్లో భార‌త సిక్స‌ర్ల కింగ్.. సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్‌..

Most Test sixes for India Rishabh Pant breaks Virender Sehwags record

Updated On : November 15, 2025 / 1:19 PM IST

Rishabh Pant : టీమ్ఇండియా వికెట్ కీప‌ర్‌, బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టు క్రికెట్‌లో టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కేశవ్ మ‌హారాజ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్ట‌డం ద్వారా పంత్ (Rishabh Pant )  ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

ఈ క్ర‌మంలో అత‌డు దిగ్గ‌జ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ ను అధిగ‌మించాడు. 103 టెస్టుల్లో సెహ్వాగ్ 90 సిక్స‌ర్లు కొట్ట‌గా.. పంత్ మాత్రం 48 టెస్టుల్లోనే అత‌డిని అధిగ‌మించాడు. ఈ మ్యాచ్‌లో పంత్ మొత్తంగా రెండు సిక్స‌ర్లు బాది సుదీర్ఘ ఫార్మాట్‌లో త‌న సిక్స‌ర్ల సంఖ్య‌ను 92కు పెంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొన్న పంత్ 2 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 27 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

Ravindra Jadeja : చెన్నైను వీడి రాజ‌స్థాన్‌కు రావ‌డంపై తొలిసారి స్పందించిన జ‌డేజా.. ఇది జ‌ట్టు కాదు..

టీమ్ఇండియా త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన బ్యాట‌ర్లు వీరే..

* రిష‌బ్ పంత్ – 48 టెస్టుల్లో 92 సిక్స‌ర్లు
* వీరేంద్ర సెహ్వాగ్ – 103 టెస్టుల్లో 90 సిక్స‌ర్లు
* రోహిత్ శ‌ర్మ – 67 టెస్టుల్లో 88 సిక్స‌ర్లు
* ర‌వీంద్ర జ‌డేజా – 88 టెస్టుల్లో 80 సిక్స‌ర్లు
* ఎంఎస్ ధోని – 90 టెస్టుల్లో 78 సిక్స‌ర్లు

Ravindra Jadeja : అందుక‌నే జ‌డేజాను వ‌దిలివేశాం.. కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వ‌నాథన్‌..