Ravindra Jadeja : చెన్నైను వీడి రాజస్థాన్‌కు రావడంపై తొలిసారి స్పందించిన జడేజా.. ఇది జట్టు కాదు..
ఐపీఎల్ 2026 వేలానికి ముందు ట్రేడింగ్ విండో ద్వారా రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు బదిలీ అయ్యాడు.
Ravindra Jadeja issues first reaction on joining Rajasthan Royals from CSK
Ravindra Jadeja : ఐపీఎల్ 2026 వేలానికి ముందు ట్రేడింగ్ విండో ద్వారా రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు బదిలీ అయ్యాడు. సంజూ శాంసన్‌ను సీఎస్‌కే ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు సామ్ కర్రన్‌లను సీఎస్‌కే నుంచి తీసుకుంది. ప్రస్తుత ఫీజు కంటే.. నాలుగు కోట్ల తక్కువ మొత్తానికి అంటే రూ.14 కోట్లకే ఆర్ఆర్ జట్టులో జడేజా చేరాడు. సంజూ శాంసన్ మాత్రం ప్రస్తుత ఫీజు రూ.18 కోట్లతోనే సీఎస్‌కేకు వెళ్లాడు. ఇక సామ్ కర్రన్ సైతం ప్రస్తుత ఫీజు రూ.2.40 కోట్లకే ఆర్ఆర్‌లో చేరాడు.
రాజస్థాన్ రాయల్స్‌లోకి తిరిగి రావడం పట్ల రవీంద్ర జడేజా స్పందించాడు. తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభమైన ఫ్రాంఛైజీలోకి తిరిగి రావడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుందన్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తనకు తొలి అవకాశం ఇచ్చిందని, అంతేకాకుండా ఐపీఎల్ ట్రోఫీ విజయం ఎలా ఉంటుందో తనకు రుచి చూపించిందని తెలిపాడు.
Aaj rumour nahi, headline likhna. Ravindra 𝑻𝒉𝒂𝒍𝒂𝒑𝒂𝒕𝒉𝒚 Jadeja is coming home ⚔️🔥 pic.twitter.com/XJT5b5plCy
— Rajasthan Royals (@rajasthanroyals) November 15, 2025
‘తిరిగి రావడం నాకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇది నాకు కేవలం ఒక జట్టు మాత్రమే కాదు. ఇది మాతృభూమి. రాజస్థాన్ రాయల్స్‌లో నేను నా మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలిచాను. ప్రస్తుత ఆటగాళ్ల బృందంతో మరిన్ని గెలవాలని ఆశిస్తున్నాను.’ అని జడేజా అధికారిక ప్రకటనలో తెలిపారు.
ఐపీఎల్‌లో మొదటి రెండు సీజన్లలో రాయల్స్ తరఫున జడేజా ఆడాడు. ఆసమయంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ అతన్ని ‘రాక్‌స్టార్’ అని పిలిచాడని చెప్పడం గమనార్హం.
ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008, ఆ తరువాతి సీజన్ 2009లో జడేజా ఆర్ఆర్ తరుపున ఆడాడు. అయితే.. 2010లో అతడు ఓ ఫ్రాంఛైజీతో వాణిజ్య ఒప్పందంపై (ట్రేడింగ్) నేరుగా చర్చలు జరిపినందుకు ఏడాది పాటు అతడిపై నిషేదం పడింది. ఇక 2012 నుంచి అతడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగం అయ్యాడు. సీఎస్‌కే పై నిషేదం పడిన రెండు సీజన్లు (2016, 17) మినహా ఇప్పటి వరకు అతడు ఆ జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు. ఇక ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ పై ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు చేసి చెన్నై ట్రోఫీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
జడేజా గురించి సంగక్కర ఏమన్నాడంటే?
రవీంద్ర జడేజా ఆర్ఆర్‌లోకి రావడం పట్ల రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ కుమార్ సంగక్కర స్పందించాడు. జడేజా రావడం వల్ల జట్టు మరింత బలోపేతం అవుతుందన్నాడు. ఐపీఎల్‌లో అతడు 254 మ్యాచ్‌లు ఆడాడని, అతడి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు మ్యాచ్‌లను మలుపుతిప్పగలడని చెప్పుకొచ్చాడు.
