×
Ad

IND vs SA : మ‌రోసారి టాస్ ఓడిపోయిన భార‌త్‌.. టీమ్ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్‌.. బ‌వుమా కీల‌క వ్యాఖ్య‌లు..

రాయ్‌పుర్ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య (IND vs SA ) రెండో వ‌న్డే మ్యాచ్ ప్రారంభ‌మైంది

IND vs SA 2nd ODI South Africa opt to bowl Team India first batting

IND vs SA : రాయ్‌పుర్ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బ‌వుమా మ‌రో ఆలోచ‌న లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భార‌త్ ఈ మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని భావిస్తోంది.

‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. రాత్రి మంచు కురిసే అవ‌కాశం ఉంది. అప్పుడు బౌల‌ర్ల‌కు బంతి పై ప‌ట్టు దొర‌క‌డం క‌ష్టం అవుతుంది. ఇక వికెట్ కూడా మ్యాచ్ సాగుతున్న కొద్ది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవ‌కాశం ఉంది. గ‌త మ్యాచ్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. మేము మూడు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతున్నాం. . నాతో పాటు కేశవ్‌ మహరాజ్‌ , లుంగి ఎంగిడి తుదిజట్టులోకి వచ్చారు. సిరీస్‌లో నిల‌బ‌డాలంటే ఈ మ్యాచ్ ఎంతో కీల‌కం.’ అని బ‌వుమా అన్నాడు.

Vaibhav Suryavanshi : స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చ‌రిత్ర సృష్టించిన‌ వైభ‌వ్ సూర్య‌వంశీ..

‘గ‌త కొంత‌కాలంగా ఓ జ‌ట్టుగా మేము టాస్ గెల‌వ‌లేక‌పోతున్నాం. గ‌త మ్యాచ్‌లో మేము రాణించాం. ఆ ప్ర‌ద‌ర్శ‌న‌నే ఈ మ్యాచ్‌లోనూ కొన‌సాగించేందుకు ప్ర‌య‌త్నిస్తాం. ఇక ప్ర‌తి జ‌ట్టు కూడా గ‌త మ్యాచ్‌లో గ‌ట్టి పోటీనిచ్చింది. వ‌రుస విరామాల్లో వికెట్లు తీస్తే అనుకున్న ఫ‌లితం రాబ‌ట్ట‌గ‌లం. ఇక తుది జ‌ట్టులో ఎలాంటి మార్పులు లేవు.’ అని కేఎల్ రాహుల్ అన్నాడు.

ద‌క్షిణాఫ్రికా తుది జట్టు..

క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), ఐడెన్ మార్క్రమ్‌, టెంబా బావుమా(కెప్టెన్‌), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి.

AUS vs ENG : తొలి టెస్టులో ఘోర ఓట‌మి.. అయినా స‌రే అదే దారి.. రెండో టెస్టుకు రెండు రోజుల ముందే..

భారత తుది జట్టు..

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణ.