Vaibhav Suryavanshi : స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చ‌రిత్ర సృష్టించిన‌ వైభ‌వ్ సూర్య‌వంశీ..

టీమ్ఇండియా న‌యా సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Suryavanshi ) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Vaibhav Suryavanshi : స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చ‌రిత్ర సృష్టించిన‌ వైభ‌వ్ సూర్య‌వంశీ..

Vaibhav Suryavanshi record breaking SMAT century

Updated On : December 2, 2025 / 2:51 PM IST

Vaibhav Suryavanshi : టీమ్ఇండియా న‌యా సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచ‌రీ చేసిన అతి పిన్న వ‌య‌స్కుడిగా చ‌రిత్ర సృష్టించాడు. మంగ‌ళ‌వారం మ‌హారాష్ట్ర‌, బిహార్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ (108 నాటౌట్; 61 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స‌ర్లు ) ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

ఈ క్ర‌మంలో అత‌డు విజ‌య్ జోల్ పేరిట ఉన్న రికార్డును అధిగ‌మించాడు. విజ‌య్ జోల్ 2013లో ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో మ‌హారాష్ట్ర త‌రుపున ఆడుతూ 63 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. అప్పుడు అత‌డి వ‌య‌సు 18 ఏళ్ల 118 రోజులు. ఇక సూర్య వంశీ (Vaibhav Suryavanshi) విష‌యానికి వ‌స్తే.. అత‌డి వ‌య‌సు 14 ఏళ్ల 250 రోజులు.

AUS vs ENG : తొలి టెస్టులో ఘోర ఓట‌మి.. అయినా స‌రే అదే దారి.. రెండో టెస్టుకు రెండు రోజుల ముందే..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. వైభ‌వ్ సూర్య వంశీ శ‌త‌కం చేయ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది. సూర్య వంశీ కాకుండా మిగిలిన వారిలో ఆకాష్ రాజ్ (26), ఆయుష్ లోహరుక (25) లు రాణించారు.

IPL : ఐపీఎల్ ద్వారా 92 కోట్లు సంపాదించాడు.. క‌ట్ చేస్తే.. వేలం నుంచి ఔట్‌..

అనంత‌రం 177 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మ‌హారాష్ట్ర 19.1 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు న‌ష్టపోయి ఛేదించింది. మ‌హారాష్ట్ర బ్యాట‌ర్ల‌లో పృథ్వీ షా (66; 30 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) విధ్వంస‌క‌ర హాఫ్ సెంచ‌రీ చేశాడు. నీరజ్ జోషి (30), రంజీత్ నికం (27) లు రాణించారు. బిహార్ బౌల‌ర్ల‌లో మహ్మద్ సలావుద్దీన్ ఇజార్, సకీబుల్ గని లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.