IND vs SA 2nd T20 Jitesh Sharma survives as ball hits bail
IND vs SA : ముల్లాన్‌పూర్ వేదికగా గురువారం భారత్, దక్షిణాఫ్రికా జట్లు రెండో టీ20 మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఫలితాన్ని పక్కన బెడితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమ్ఇండియా బ్యాటర్ జితేశ్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా ఇది జరిగింది. బంతి బలంగా వికెట్లను తాకినప్పటికి కూడా బెయిల్స్ పడలేదు.
భారత ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఇది జరిగింది. ఈ ఓవర్‌ను దక్షిణాఫ్రికా పేసర్ ఓట్నీల్ బార్ట్‌మన్ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని జితేశ్ శర్మ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే.. బంతి అతడి బ్యాట్‌ను తగలలేదు. బెయిల్స్‌ను తాకి వికెట్ కీపర్ దిశగా వెళ్లింది. బాల్ తాకడంతో బెయిల్స్‌కు ఉండే లైట్లు వెలిగాయి. కానీ బెయిల్స్ మాత్రం కిందపడలేదు.
పిచ్చకొట్టుడు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. 14 సిక్సర్లు.. డబుల్ సెంచరీకి జస్ట్ మిస్.. కానీ..
అంత వేగంగా బాల్ తాకినప్పటికి బెయిల్స్ కిందపడలేదు సరికదా వాటి స్థానం కూడా ఏ మాత్రం మారలేదు. దీంతో జితేశ్ ఔట్ కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో జితేశ్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 27 పరుగులు సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (90; 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఆ తరువాత 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ (62; 34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు.
Wait What was that ?🤯
Ball hit the stumps but Jitesh Sharma is still not out !!🤓#INDvsSA #Jiteshsharma pic.twitter.com/C9zHPAuqmA— PhysicsFanclub (@Physics_Fanclub) December 11, 2025