పిచ్చకొట్టుడు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. 14 సిక్సర్లు.. డబుల్ సెంచరీకి జస్ట్ మిస్.. కానీ..
అండర్19 ఆసియా కప్ 2025లో టీమ్ఇండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)అదరగొడుతున్నాడు.
ACC Mens U19 Asia Cup 2025 Vaibhav Suryavanshi century in 56 balls
Vaibhav Suryavanshi : అండర్19 ఆసియా కప్ 2025లో టీమ్ఇండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా యూఏఈతో మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 56 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఆ తరువాత మరింతగా చెలరేగాడు. తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
ఉద్దీష్ సూరి బౌలింగ్‌లో స్కూప్ షాట్కు ప్రయత్నించే క్రమంలో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో వైభవ్ 95 బంతులు ఎదుర్కొన్నాడు. 9 ఫోర్లు, 14 సిక్సర్ల సాయంతో 171 పరుగులు సాధించాడు.
Nitish Kumar Reddy : హ్యాట్రిక్‌తో చెలరేగిన నితీశ్ కుమార్ రెడ్డి.. అయినా గానీ..
యూత్ వన్డే క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీకి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ ఆటగాడు అన్ని ఫార్మాట్‌లలో తనదైన శైలిలో విధ్వంసం కొనసాగిస్తూ మంచి ప్రదర్శనలను నమోదు చేస్తున్నాడు.
56 BALL HUNDRED BY VAIBHAV SURYAVANSHI IN THE U19 ASIA CUP. 🇮🇳🫡pic.twitter.com/0evBWfVdaD
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2025
