×
Ad

IND vs SA : రెండో టెస్టులో ప‌ట్టుబిగించిన ద‌క్షిణాఫ్రికా.. మ్యాచ్‌ను భార‌త్ డ్రా చేసుకోవాల‌న్నా మ‌హాద్భుతం జ‌ర‌గాల్సిందేనా?

గౌహ‌తి వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా (IND vs SA) ప‌ట్టు బిగించింది.

IND vs SA 2nd Test Day 3 Stumps South Africa lead by 314 runs

IND vs SA : గౌహ‌తి వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా ప‌ట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 26 ప‌రుగులు సాధించింది. ర్యాన్ రికెల్టన్ (13), ఐడెన్ మార్‌క్ర‌మ్ (12)లు క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా 314 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు ద‌క్షిణాఫ్రికా ఎంత స్కోరు వ‌ద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తుంది? భార‌త బ్యాట‌ర్లు ఎలా రాణిస్తారు?  అన్న దానిపైనే మ్యాచ్ ఫ‌లితం ఆధార‌ప‌డి ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో భార‌త్ విజ‌యం సాధించ‌డం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. క‌నీసం డ్రా చేసుకున్నా కూడా గొప్పే.

అంత‌క‌ముందు 9/0 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన భార‌త్ మ‌రో 192 ప‌రుగులు జోడించి 10 వికెట్లు కోల్పోయింది. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 201 ప‌రుగుల‌కు ఆలౌట్ కావ‌డంతో ద‌క్షిణాఫ్రికాకు 288 ప‌రుగుల భారీ ఆధిక్యం ల‌భించింది.

Team India : వంద ప‌రుగులు దేవుడికి ఎరుక‌.. క‌నీసం 100 బంతులు ఆడ‌లేక‌పోతున్నారుగా.. కుల్దీప్ నువ్వు తోప‌య్యా..

భార‌త బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైస్వాల్ (59; 97 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా.. వాషింగ్ట‌న్ సుంద‌ర్ (48; 92 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. కేఎల్ రాహుల్ (22), కుల్దీప్ యాద‌వ్ (19) ప‌ర్వాలేద‌నిపించ‌గా.. ధ్రువ్ జురెల్ (0), సాయి సుద‌ర్శ‌న్ (15), రిష‌బ్ పంత్ (7), ర‌వీంద్ర జ‌డేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి(10)లు విఫ‌లం అయ్యారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో మార్కో జాన్సెన్ ఆరు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సైమన్ హార్మర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. కేశ‌మ్ మ‌హ‌రాజ్ ఓ వికెట్ సాధించాడు.

IND vs SA : తిల‌క్ వ‌ర్మ‌పై ఇర్ఫాన్ ప‌ఠాన్ కామెంట్స్‌.. వ‌న్డేల్లో అత‌డిని..

ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 ప‌రుగులు చేసిన సంగ‌తి తెలిసిందే.