IND vs SA 2nd Test Day 4 Lunch Break South Africa lead by 508 runs
IND vs SA : గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. నాలుగో రోజు 26/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా లంచ్ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (60; 155 బంతుల్లో 5 ఫోర్లు), వియాన్ ముల్డర్ (29; 43 బంతుల్లో, 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా లీడ్ 508 పరుగులకు చేరుకుంది.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో టోనీ డీ జోర్జి (49; 68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం తృటిలో చేజారింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (35; 64 బంతుల్లో 4 ఫోర్లు), ఐడెన్ మార్‌క్రమ్ (29; 84 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ టెంబా బవుమా (3) విఫలం అయ్యాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ పడగొట్టాడు.
Lunch on Day 4!
Ravindra Jadeja with the wicket of Tony de Zorzi in the session.
South Africa lead by 508 runs.
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/wmGFavslpk
— BCCI (@BCCI) November 25, 2025
500 దాటిన లీడ్..
ప్రస్తుతం దక్షిణాఫ్రికా లీడ్ 500 పరుగులు దాటింది. అయినప్పటికి కూడా దక్షిణాఫ్రికా (IND vs SA) ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయలేదు. ఇంకా ఎన్ని పరుగులకు సఫారీలు డిక్లేర్ చేస్తారు అన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. టీమ్ఇండియా బ్యాటర్లు ఈ సిరీస్‌లో ఆడుతున్న దాటి బట్టి చూస్తే 400 పరుగులు చేయడం కూడా కష్టమే అన్నది క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఇక నాలుగో ఇన్నింగ్స్ 500 లకు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఎంతో కష్టం అన్న సంగతి తెలిసిందే.