IND vs SA 2nd Test KL Rahul Drops Aiden Markram At Slips
IND vs SA : గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు రెండో టెస్టు మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఇప్పటికే సిరీస్‌లో 0-1తో వెనుకబడిన భారత్ ఈ మ్యాచ్‌లో (IND vs SA)విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే.. భారత్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ముందుగా టాస్ ఓడిపోవడంతో టీమ్ఇండియా తొలుత బౌలింగ్ చేస్తోంది.
ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే వికెట్ పడగొట్టి సఫారీలను ఒత్తిడిలోకి నెట్టే సువర్ణావకాశాన్ని కేఎల్ రాహుల్ చేజార్చాడు. లడ్డూ లాంటి క్యాచ్ మిస్ చేశాడు.
అసలేం జరిగిందంటే..?
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను జస్‌ప్రీత్ బుమ్రా వేశాడు. రెండో బంతిని గుడ్‌లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఈ బంతిని షాట్ ఆడాలని మార్‌క్రమ్ భావించాడు. అయితే.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ దిశగా వెళ్లింది. రాహుల్ తన ఎడమ పక్కకు జరిగి క్యాచ్ అందుకోనే ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు.
ఈజీ క్యాచ్‌ను మిస్ చేయడంతో బౌలర్ బుమ్రా తీవ్ర నిరాశకు గురి అయ్యాడు. వెంటనే తన ముఖాన్ని చేతుల్లో దాచుకుంటూ తన అసంతృప్తిని బయటకు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా.. ఈ అవకాశాన్ని మార్‌క్రమ్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. నాలుగు పరుగుల వద్ద ఔట్ కావాల్సి వాడు మరో 34 పరుగులు జత చేశాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని 5 ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లోనే టీ విరామం ఆఖరి ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 82 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
KL Rahul dropped the catch of A Markram 🫣#TeamIndia #IndvSA #TestCricket pic.twitter.com/yA8MzTtkWJ
— MEHRA (@DevMehra790) November 22, 2025
టీ విరామ సమయానికి దక్షిణాఫ్రికా 26.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (35) క్రీజులో ఉన్నాడు.