×
Ad

IND vs SA : పంత్ కెప్టెన్సీలోనూ భార‌త్ రాత‌మార‌లే.. మ‌రోసారి టాస్ ఓడిన టీమ్ఇండియా.. తెలుగోడికి చోటు, అక్ష‌ర్ పై వేటు.. సాయి సుద‌ర్శ‌న్‌..

గౌహ‌తి వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య (IND vs SA ) రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది.

IND vs SA 2nd Test South Africa opt to bat

IND vs SA : గౌహ‌తి వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బ‌వుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ తొలుత బౌలింగ్ చేయ‌నుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుక‌బ‌డిన భార‌త్ ఈ మ్యాచ్‌లో (IND vs SA) విజ‌యం సాధించి సిరీస్‌ను స‌మం చేయాల‌ని భావిస్తోంది. రెగ్యుల‌ర్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ దూరం కావ‌డంతో రిష‌బ్ పంత్ భార‌త జ‌ట్టుకు నాయ‌కత్వం వ‌హిస్తున్నాడు.

పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంద‌ని భావిస్తున్నాము. అందుక‌నే బ్యాటింగ్ చేస్తాం. భారీ స్కోరు సాధిస్తాం. ప్ర‌స్తుతానికి పిచ్ పై ప‌గుళ్లు లేవు. తుది జ‌ట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. సెనురాన్ ముత్తుస్వామి వ‌చ్చాడు. అని బ‌వుమా తెలిపాడు.

India A vs Bangladesh A : నరాలుతెగే ఉత్కంఠ.. సూపర్‌ ఓవర్‌లో భారత్‌కు బిగ్‌షాక్.. అయ్యో వైభవ్‌.. వీడియో వైరల్

టీమ్ఇండియా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నాడు రిష‌బ్ పంత్. తుది జ‌ట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయ‌న్నాడు. గిల్ స్థానంలో ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి, అక్ష‌ర్ ప‌టేల్ స్థానంలో సాయి సుద‌ర్శ‌న్‌లు జ‌ట్టులోకి వ‌చ్చార‌న్నాడు. టాస్ ఓడిపోవ‌డం పై మాట్లాడుతూ.. ప‌ర్వాలేద‌న్నాడు. ఇక గిల్ కోలుకుని త్వర‌లోనే జ‌ట్టులోకి వ‌స్తాడ‌న్నాడు.

దక్షిణాఫ్రికా తుది జట్టు..
ఐడెన్‌ మార్‌క్రమ్‌, ర్యాన్‌ రికెల్టన్‌, వియాన్‌ ముల్డర్‌, టెంబా బవుమా (కెప్టెన్‌), టోనీ డి జోర్జి, ట్రిస్టాన్‌ స్టబ్స్‌, కైల్ వేరీన్ (వికెట్‌ కీపర్‌), మార్కో యాన్సెన్‌, సేనురన్ ముత్తుసామి, సైమన్‌ హార్మర్‌, కేశవ్‌ మహారాజ్‌

AUS vs ENG : వందేళ్ల‌లో ఇదే తొలిసారి.. యాషెస్‌ సిరీస్‌కు అదిరిపోయే ఆరంభం..

టీమ్ఇండియా తుది జ‌ట్టు..
కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, సాయి సుదర్శన్‌, ధ్రువ్‌ జురేల్‌, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

&