×
Ad

IND vs SA : ట్రిస్టన్ స్టబ్స్ సెంచ‌రీ మిస్‌.. టీమ్ఇండియా ఎదుట భారీ ల‌క్ష్యం..

గౌహ‌తి వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు (IND vs SA )మ్యాచ్ జ‌రుగుతోంది.

IND vs SA 2nd Test team India target is 549

IND vs SA : గౌహ‌తి వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది. రెండో ఇన్నింగ్స్‌ను ద‌క్షిణాఫ్రికా 5 వికెట్ల న‌ష్టానికి 260 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 288 ప‌రుగులు క‌లుపుకుని ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు భార‌త్ ముందు 549 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో ట్రిస్టన్ స్టబ్స్ (94; 180 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. అత‌డు జ‌డేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగానే దక్షిణాఫ్రికా త‌మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టోని డి జోర్జి (49; 68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), రికెల్‌టన్ (35), వియాన్ ముల్డర్ (35 నాటౌట్‌), మార్‌క్రమ్ (29) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా నాలుగు వికెట్లు తీయ‌గా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

Palash Muchhal : పలాష్‌ ముచ్చల్‌ తల్లి కీల‌క వ్యాఖ్య‌లు.. కాబోయే కోడ‌లు కాదు.. కొడుకే పెళ్లి ఆపేశాడు.. 4 గంట‌లు ఆస్ప‌త్రిలోనే..

అంత‌క ముందు ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత భార‌త్ 201 ప‌రుగుల‌కు ఆలౌటైంది.