×
Ad

IND vs SA : ఎట్ట‌కేల‌కు టాస్ గెలిచిన భార‌త్‌.. ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్‌.. తెలుగోడు వ‌చ్చేశాడు..

విశాఖ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య (IND vs SA)మూడో వ‌న్డే మ్యాచ్ ప్రారంభ‌మైంది.

IND vs SA 3rd ODI India won the toss and opt to bowl

IND vs SA : విశాఖ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్ ప్రారంభ‌మైంది. టీమ్ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. మ‌రో ఆలోచ‌న లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. కాగా.. వ‌రుస‌గా 20 మ్యాచ్‌ల్లో భార‌త్ టాస్ ఓడిపోగా నేటి మ్యాచ్ లో ఇందుకు ఫుల్ స్టాఫ్ ప‌డింది.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి వ‌న్డేలో భార‌త్, రెండో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించాయి. దీంతో ఆఖ‌రిదైన విశాఖ‌లో విజ‌యం సాధించి సిరీస్‌ను కైవ‌సం చేసుకోవాల‌ని ఇరు జ‌ట్లు (IND vs SA)ప‌ట్టుద‌లగా ఉన్నాయి.

Virat Kohli : మూడు వారాల క్రితమే విరాట్ కోహ్లీ కీల‌క నిర్ణ‌యం..!


‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. గ‌త రాత్రి ఇక్క‌డ ప్రాక్టీస్ చేస్తున్న‌ప్పుడు కూడా మంచు కురిసింది. మా బౌల‌ర్లు తొలుత ఎలా బౌలింగ్ చేస్తారో చూడాల‌ని అనుకుంటున్నాము. మేము ఎంత‌టి ల‌క్ష్యాన్ని అయినా ఛేదిస్తామ‌ని అనుకుంటున్నాము. పిచ్ చాలా బాగుంది. గ‌త రెండు మ్యాచ్‌ల్లో మేము ఆడిన విధానం ప‌ట్ల సంతోషంగా ఉన్నాము. తుది జ‌ట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. వాషింగ్టన్ సుంద‌ర్ స్థానంలో తిల‌క్ వ‌ర్మ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు.’అని భార‌త కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.

‘టాస్ గెలిస్తే మేము కూడా ముందుగా బౌలింగ్ చేసే వాళ్లం. ఓపెన‌ర్లు మంచి ఆరంభాన్ని అందిస్తార‌ని ఆశిస్తున్నాను. స్టేడియం నిండిపోయింది. మ‌రో హోరా హోరీ పోరు త‌ప్పద‌ని అనుకుంటున్నాం. తుది జ‌ట్టులో రెండు మార్పులు జ‌రిగాయి. గాయ‌ప‌డిన బర్గర్, డి జోర్జీ స్థానాల్లో రికెల్టన్, బార్ట్‌మన్ జట్టులోకి వ‌చ్చారు.’అని ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బ‌వుమా తెలిపాడు

ద‌క్షిణాఫ్రికా తుది జ‌ట్టు..
ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీప‌ర్‌), టెంబా బావుమా(కెప్టెన్‌), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రామ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, ఓట్నీల్ బార్ట్‌మన్

WBBL 2025 : బాల్ కార‌ణంగా ర‌ద్దైన మ‌హిళ‌ల బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలా ఎన్న‌డూ జ‌రిగి ఉండ‌దు.. పిచ్ మ‌ధ్య‌లో రంధ్రం..

భార‌త తుది జ‌ట్టు..
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్‌), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ