IND vs SA 3rd ODI Quinton de Kock century Team India target is 271
IND vs SA : విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ (106; 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. ఇక దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 271 పరుగుల లక్ష్యం నిలిచింది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో డికాక్ కాకుండా కెప్టెన్ టెంబా బవుమా (48; 67 బంతుల్లో 5 ఫోర్లు) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ (29), మాథ్యూ బ్రీట్జ్కే (24) లు పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ లు చెరో నాలుగు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా. అర్ష్‌దీప్ సింగ్ లు తలా ఓ వికెట్ సాధించారు.
South Africa are all out for 2⃣7⃣0⃣ in Vizag
Prasidh Krishna with the final wicket of the innings 😎
He finishes with a four-wicket haul 🙌
Scorecard ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/5mays2y5uS
— BCCI (@BCCI) December 6, 2025