IND vs SA 3rd ODI Virat Kohli funny answer to Arshdeep Singh question
Virat Kohli : దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. శనివారం విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. తద్వారా వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. క్వింటన్ డికాక్ (106; 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో చెలరేగినప్పటికి కూడా 47.5 ఓవర్లలో 270 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌటైంది. కెప్టెన్ టెంబా బవుమా (48) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ లు చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్ లు తలా ఓ వికెట్ తీశారు.
ఆ తరువాత యశస్వి జైస్వాల్ (116 నాటౌట్; 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగగా.. రోహిత్ శర్మ (75; 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (65నాటౌట్; 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు బాదడంతో 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ 39.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి అందుకుంది.
తొలి రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ మూడో వన్డే మ్యాచ్‌ల్లోనూ 65 పరుగులతో అజేయంగా నిలిచాడు. దక్షిణాఫ్రికా గనుక ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీ శతకం బాది ఉండేవాడు. ఇదే విషయాన్ని టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మ్యాచ్ అనంతరం కోహ్లీతో ప్రస్తావించాడు.
పరుగులు తక్కువగా ఉన్నాయి. లేదంటే మరో సెంచరీ నీ ఖాతాలో పడి ఉండేదని అర్ష్‌దీప్ సింగ్ అన్నాడు. ఇందుకు కోహ్లీ ఫన్నీగా సమాధానం చెప్పాడు. మనం టాస్ గెలవడం చాలా మంచిది అయింది. లేకుంటే మంచులో బౌలింగ్ చేసి ఉంటే నీ సెంచరీ అయి ఉండేది. అని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Arshdeep said “Few runs short, otherwise another century was confirmed for you”.
Kohli replied “It was good we won the toss, otherwise you would have also completed your century due to dew”. 😂🔥 pic.twitter.com/ab4nrvVCV1
— Johns. (@CricCrazyJohns) December 6, 2025
ఇక టీమ్ఇండియా వరుసగా 20 వన్డే మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనే టాస్ గెలవడం గమనార్హం.