Virat Kohli : సనత్ జయసూర్య రికార్డు బ్రేక్.. సచిన్ మరో వన్డే ప్రపంచ రికార్డుకు చేరువలో కోహ్లీ
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli)పరుగుల వరద పారించాడు.
Most Player of the Series in ODIs Virat Kohli surpasses Sanath Jayasuriya
Virat Kohli : దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించాడు. తొలి రెండు వన్డేల్లో శతకాలు బాదిన కోహ్లీ విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లోనూ అజేయ అర్థశతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా వన్డే సిరీస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది.
ఇక మూడు మ్యాచ్‌ల్లో 302 పరుగులు చేసిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 12వ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు. ఈ క్రమంలో కోహ్లీ శ్రీలంక దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్యను అధిగమించాడు. జయసూర్య వన్డేల్లో 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను సొంతం చేసుకున్నాడు.
ఇక వన్డేల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను సొంతం చేసుకున్న రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 15 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
వన్డేల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను సొంతం చేసుకున్న ఆటగాళ్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ (భారత్) – 15 సార్లు
* విరాట్ కోహ్లీ (భారత్) – 12 సార్లు
* సనత్ జయసూర్య (శ్రీలంక) -11 సార్లు
* షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా) – 9 సార్లు
* క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 8 సార్లు
2-3 ఏళ్లుగా నేను ఇలా ఆడలేదు..
మూడో వన్డే అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. వాస్తవం చెప్పాలంటే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో తాను ఆడిన విధానం తనకు ఎంతో నచ్చిందన్నాడు. గత రెండు మూడేళ్లుగా తాను ఇలా ఆడలేకపోయానన్నాడు. మధ్య ఓవర్లలో దూకుడుగా బ్యాటింగ్ చేయగలనన్న విషయం తనకు తెలుసునని, స్వేచ్ఛగా ఆడితే సిక్సర్లు కొట్టగలనని అన్నాడు. అది జట్టుకు సహాయపడుతుందన్నాడు. ఇక సిరీస్‌లో రాంచీలో ఆడిన ఇన్నింగ్స్ తనకు ఎంతో ప్రత్యేకమైనదన్నాడు.
Virat Kohli : ‘కోహ్లీ మామ.. నేను నీకు కాబోయే కోడలిని..’ ఫ్లకార్డుతో చిన్నారి.. వీడియో వైరల్
ఎందుకంటే ఆసీస్‌తో సిరీస్ తరువాత ఏ మ్యాచ్‌లో ఆడకుండా నేరుగా రాంచీలోనే ఆడినట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌లో రాణించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఇక సిరీస్ సమం అయినప్పుడు జట్టు కోసం ఏదైన ప్రత్యేకంగా చేయాలని రోహిత్‌తో చర్చించానని, విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నాడు.
