Virat Kohli : ‘కోహ్లీ మామ‌.. నేను నీకు కాబోయే కోడ‌లిని..’ ఫ్ల‌కార్డుతో చిన్నారి.. వీడియో వైర‌ల్‌

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Virat Kohli : ‘కోహ్లీ మామ‌.. నేను నీకు కాబోయే కోడ‌లిని..’ ఫ్ల‌కార్డుతో చిన్నారి.. వీడియో వైర‌ల్‌

IND vs SA Young fan holds poster calling Virat Kohli Father in Law

Updated On : December 6, 2025 / 3:02 PM IST

Virat Kohli : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మ‌న‌దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా అత‌డికి అభిమానులు ఉన్నారు. అత‌డు మ్యాచ్ ఆడుతున్నాడు అంటే చూసేందుకు పెద్ద సంఖ్య‌లో ప్రేక్ష‌కులు స్టేడియాల‌కు వ‌స్తారంటే అతి శ‌యోక్తి కాదు. చిన్న‌పిల్ల‌ల నుంచి పెద్ద‌వాళ్ల వర‌కు అంద‌రూ అత‌డిని ఇష్ట‌ప‌డుతూ ఉంటారు.

ఇక రాయ్‌పూర్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్ సంద‌ర్భంగా ఓ చిన్నారి ఫ్ల‌కార్డు ప‌ట్టుకున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఆ ఫ్ల‌కార్డులో కోహ్లీ (Virat Kohli )కి స్వాగ‌తం చెబుతూనే.. అత‌డు త‌న‌కు మామ అవుతాడ‌ని, తాను అత‌డికి కాబోయే కోడ‌లిని ఓ ఫ్ల‌కార్డు ప‌ట్టుకుని నిలుచుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స‌ర‌దాగా కామెంట్లు పెడుతున్నారు.

IND vs SA : ఎట్ట‌కేల‌కు టాస్ గెలిచిన భార‌త్‌.. ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్‌.. తెలుగోడు వ‌చ్చేశాడు..

ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ శ‌త‌కంతో చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. వ‌న్డేల్లో కోహ్లీకి ఇది 53 శ‌త‌కం కాగా.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 84వది. ఇక ఈ మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోయింది.

ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు అన్న సంగ‌తి తెలిసిందే. 2021 జ‌న‌వ‌రిలో వామిక జ‌న్మించ‌గా 2024 ఫిబ్ర‌వ‌రిలో అకాయ్ కోహ్లీ జ‌న్మించాడు. అయితే.. కోహ్లీ త‌న పిల్ల‌ల గురించి చాలా గోప్యంగా ఉంచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు వారి ముఖాల‌ను అభిమానుల‌తో పంచుకోలేదు. త‌న పిల్ల‌ల ముఖాల‌ను చూపించ‌వ‌ద్ద‌ని ప‌లు సంద‌ర్భాల్లో అత‌డు మీడియాను సైతం కోరాడు.

WBBL 2025 : బాల్ కార‌ణంగా ర‌ద్దైన మ‌హిళ‌ల బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలా ఎన్న‌డూ జ‌రిగి ఉండ‌దు.. పిచ్ మ‌ధ్య‌లో రంధ్రం..

 

View this post on Instagram

 

A post shared by Heena Sahu (@heena_12_08_)