IND vs SL : సూర్యకుమార్ సూపర్ కెప్టెన్సీ.. మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ఆ రెండు ఓవర్లు.. వీడియో వైరల్

సూర్యకుమార్ సూపర్ కెప్టెన్సీతో చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయాన్ని భారత్ జట్టు అమాంతం లాగేసుకుంది. 19వ ఓవర్ పార్ట్ టైం స్పినర్ ..

Suryakumar Yadav and Rinku Singh

Surya Kumar Yadav : పల్లెకెలె వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక మూడో టీ20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. సూర్యకుమార్ అద్భుత కెప్టెన్సీతో శ్రీలంక సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ విజేతగా నిలిచింది. తద్వారా మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. చివరిలో రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ లు అద్భుత బౌలింగ్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. సూపర్ ఓవర్లోనూ సుందర్ వేసిన సూపర్ బౌలింగ్ కూడా తోడు కావటంతో భారత్ జట్టు విజేతగా నిలిచింది. సూర్యకుమార్ వేసిన చివరి ఓవర్ క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Also Read : IND vs SL 3rd T20I : సిరీస్ క్లీన్‌స్వీప్.. సూపర్ ఓవర్‌‌లో టీమిండియా విజయం..!

ఈ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించగా.. ఆదినుంచి ఎదురుదెబ్బలు తగిలాయి. వరుసగా కీలక బ్యాటర్లు వికెట్లు కోల్పోయారు. గిల్ (39 పరుగులు) చేయగా.. చివరల్లో పరాగ్ (26), సుందర్ (25) ఆదుకున్నారు. అయినా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. 138 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక బ్యాటర్లు ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ విజయం దిశగా అడుగులు వేశారు. మ్యాచ్ చూస్తున్నవారుసైతం శ్రీలంక విజయం నల్లేరుపై నడకేనని భావించారు. ఐదు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి ఉంది. తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నాయి. అయితే, 16వ ఓవర్లో రవి బిష్ణోయ్ కుసాల్ మెండిస్ వికెట్ పడగొట్టగా.. 17వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ వరుసగా రెండు బంతుల్లో వనిందు హసరంగా, చరిత్ అసలంకలను ఔట్ చేశాడు. 18వ ఓవర్లో ఖలీల్ ఏకంగా 12 పరుగులు ఇచ్చాడు. దీంతో రెండు ఓవర్లలో శ్రీలంక తొమ్మిది పరుగులు చేయాల్సిన స్థితికి చేరింది.

Also Read : MS Dhoni : ఈ కండిష‌న్‌కు బీసీసీఐ ఓకే అంటేనే.. ఐపీఎల్ 2025లో ధోని ఆడేది..?

సూర్యకుమార్ సూపర్ కెప్టెన్సీతో చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయాన్ని భారత్ జట్టు అమాంతం లాగేసుకుంది. 19వ ఓవర్ పార్ట్ టైం స్పిన్నర్ రింకూ సింగ్ బౌలింగ్ చేశాడు. రింకూ కెప్టెన్ అంచనాలను మించి బౌలింగ్ చేశాడు. దీంతో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి కుశాల్ పెరీరా, రమేశ్ లను ఔట్ చేశాడు. ఇక చివరి ఓవర్లో ఆరు పరుగులు చేస్తే శ్రీలంక విజయం సాధించేది. టీమిండియా పాస్ట్ బౌలర్ సిరాజుద్దీన్ బౌలింగ్ చేస్తాడని అందరూ భావించారు. కానీ, సూర్య కుమార్ తానే స్వయంగా రంగంలోకిదిగి బౌలింగ్ చేసేందుకు సిద్ధమై అందరినీ ఆశ్చర్యపర్చాడు. కీలక ఓవర్లో సూర్య బౌలింగ్ అంటే అందరూ ఒకింత ఆశ్చర్యపోయారు. కానీ, సూర్య అద్భుత బౌలింగ్ చేశాడు. తొలి బంతికి పరుగులు రాలేదు. 2,3 బంతులకు కమిందు, తీక్షణలను ఔట్ చేశాడు. నాల్గో బంతికి సింగిల్ వచ్చింది. ఐదో బంతికి రెండు పరుగులు వచ్చాయి. శ్రీలంక జట్టు విజయానికి చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే, చివరి బంతికి కేవలం రెండు పరుగులే రావడంతో మ్యాచ్ డ్రా అయింది. సూపర్ ఓవర్లో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

 

 

ట్రెండింగ్ వార్తలు