×
Ad

Shubman Gill : నువ్వు టాస్ గెలిచావురా.. శుభ్‌మ‌న్ గిల్‌ను ఆటప‌ట్టించిన టీమ్ఇండియా ఆట‌గాళ్లు.. వీడియో వైర‌ల్..

ఎట్ట‌కేల‌కు శుభ్‌మ‌న్ (Shubman Gill) టెస్టుల్లో టాస్ గెలిచాడు. వ‌రుస‌గా ఆరు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయిన గిల్‌..

IND vs WI 2nd Test Shubman Gill Wins First Ever Toss As Test Captain

Shubman Gill : టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ఎట్ట‌కేల‌కు టెస్టు క్రికెట్‌లో టాస్ గెలిచాడు. శుక్ర‌వారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ వేదిక‌గా వెస్టిండీస్‌తో ప్రారంభ‌మైన రెండో టెస్టు మ్యాచ్‌లో గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

గ‌త జూన్‌లో సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ నుంచి శుభ్‌మ‌న్ గిల్ టెస్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అందుకున్నాడు. ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో భార‌త జ‌ట్టుకు నాయ‌కుడిగా గిల్ ప‌గ్గాలు చేప‌ట్టాడు. ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ ఐదు టెస్టులు ఆడింది. ఒక్క‌టంటే ఒక్క మ్యాచ్‌లోనూ గిల్ టాస్ గెల‌వ‌లేదు.

Richa Ghosh : 11 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 94 ప‌రుగులు.. మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో రిచా ఘోష్ ఆల్ టైమ్ రికార్డు..

ఆ త‌రువాత స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్‌లోనూ గిల్ టాస్ గెల‌వ‌లేదు. ఈ క్ర‌మంలో వ‌రుస‌గా ఆరు టెస్టు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయిన అరంగ్రేట భార‌త కెప్టెన్‌గా గిల్ రికార్డుల‌కు ఎక్కాడు. ఇక ఎట్ట‌కేల‌కు రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి.. కాయిన్ టాస్‌లో విష‌యంలో దుర‌దృష్టానికి ముగింపు ప‌లికాడు.

Harmanpreet Kaur : గెలిచే మ్యాచ్‌లో ఎందుకు ఓడిపోయామంటే.. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కామెంట్స్ వైర‌ల్‌..

ఇక గిల్ టాస్ గెల‌వ‌డంతో హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌, పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాతో పాటు టీమ్ఇండియా శిబిరం మొత్తం న‌వ్వ‌డం ప్రారంభించారు. చివ‌రికి టాస్ శాపం ఛేదించ‌గ‌లిగావు అంటూ ఎగ‌తాళి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.