IND vs WI 2nd Test Team India target is 120
IND vs WI 2nd Test : ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ముందు 121 పరుగుల లక్ష్యం నిలిచింది. 270 పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో జాన్ కాంప్‌బెల్ (115; 199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), షై హోప్ (103; 214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) లు శతకాలు బాదారు. జస్టిన్ గ్రీవ్స్(50 నాటౌట్), రోస్టన్ ఛేజ్ (40) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా చెరో మూడు వికెట్లు తీశారు. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. జడేజా, సుందర్ లు తలా ఓ వికెట్ తీశారు.
ఆఖరి వికెట్‌కు 79 పరుగులు..
రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 311 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అప్పటికి విండీస్ ఆధిక్యం 41 మాత్రమే. దీంతో చివరి వికెట్‌ను భారత్ ఈజీగా పడగొడుతుందని, లక్ష్యం 50 లోపు ఉంటుందని అంతా భావించారు. అయితే.. జస్టిన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్ (32) జోడి అద్భుతంగా ఆడింది. ఒక్కొ పరుగు జోడిస్తూ లక్ష్యాన్ని 100 పరుగులు దాటించారు. ఆఖరి వికెట్‌కు 79 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Ramiz Raja : మైక్ ఆన్‌లో ఉందని మరిచిపోయిన రమీజ్ రాజా..! బాబర్ పై అనుచిత వ్యాఖ్యలు..!
𝐈𝐧𝐧𝐢𝐧𝐠𝐬 𝐁𝐫𝐞𝐚𝐤!
Jasprit Bumrah wraps up the innings with his 3⃣rd wicket ☝️#TeamIndia need 1⃣2⃣1⃣ runs to win the match and the series 👍
Scorecard ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/N0Z0vsZwkL
— BCCI (@BCCI) October 13, 2025
అంకముందు యశస్వి జైస్వాల్ (175), శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్)లు శతకాలతో చెలరేడగంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518-5 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బౌలర్ల ధాటికి విండీస్ 81.5 ఓవర్లలో 248 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ కు 270 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం ఫాలో ఆన్‌లో బరిలోకి దిగిన విండీస్ 390 పరుగులకు కుప్పకూలింది.