Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఏకంగా వైస్ కెప్టెన్సీ ఛాన్స్..
వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Suryavanshi ) బీహార్ క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

Vaibhav Suryavanshi Named Vice Captain Of Bihar Ranji Team
Vaibhav Suryavanshi : టీమ్ఇండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. భారత్-19 జట్టు తరుపున ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలల్లో తనదైన శైలిలో పరుగుల వరద పారించాడు. ఈక్రమంలో అతడికి బీహార్ క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతడిని రంజీ సీజన్ 2025-26 కు బీహార్ జట్టులోకి తీసుకోవడమే కాదు.. ఏకంగా వైస్ కెప్టెన్‌ను చేసింది. అరంగ్రేట మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన సాకిబుల్ గనిని జట్టు కెప్టెన్‌గా నియమించింది.
సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఇప్పటి వరకు బీహార్ తరుపున 5 ఫస్ట్ క్యాచ్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 158 బంతులు ఎదుర్కొని 100 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
ఐపీఎల్‌లో అదరగొట్టి..
ఐపీఎల్ 2025 సీజన్‌లో అతడు రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడాడు. మెగా వేలంలో అతడిని ఆర్ఆర్ రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. అతడు ఆర్ఆర్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి తన పేరును ఐపీఎల్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు.
బిహార్ జట్టు ఇదే..
పీయూష్ కుమార్ సింగ్, భాష్కర్ దూబే, సకీబుల్ గని (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అర్నవ్ కిషోర్, ఆయుష్ లోహరుక, బిపిన్ సౌరభ్, అమోద్ యాదవ్, నవాజ్ ఖాన్, సాకిబ్ హుస్సేన్, రాఘవేంద్ర ప్రతాప్ సింగ్, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు కుమార్, ఖలిద్.
Ahmar Khan : విషాదం.. చివరి బంతి వేసి జట్టును గెలిపించి.. పిచ్ పై కుప్పకూలి మరణించిన బౌలర్..
రంజీట్రోఫీ 2025-26 సీజన్‌లో బీహార్ ప్రయాణం అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.