John Campbell : నువ్వు మామూలోడివి కాదురా అయ్యా.. నీ ఓపికకు దండం పెట్టాల్సిందే.. 7 ఏళ్లు.. 50 ఇన్నింగ్స్‌లు..
వెస్టిండీస్ ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (John Campbell ) టెస్టుల్లో తన తొలి సెంచరీని సాధించాడు.

John Campbell becomes 1st West Indian opener to hit century in India since 2002
John Campbell : వెస్టిండీస్ ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ టెస్టుల్లో తన తొలి సెంచరీని సాధించాడు. ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అతడు శతకాన్ని బాదాడు. జడేజా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 174 బంతుల్లో మూడు అంకెల స్కోరు సాధించాడు.
కాగా.. తొలి టెస్టు శతకాన్ని సిక్సర్‌తో పూర్తి చేసుకున్న ఐదో వెస్టిండీస్ ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. అతడి కన్నా ముందు కాలిన్స్ కింగ్, రాబర్ట్ శామ్యూల్స్, రిడ్లీ జాకబ్స్, షేన్ డౌరిచ్ లు ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఓపెనర్‌గా టెస్టు క్రికెట్‌లో తొలి శతకాన్ని అందుకోవడానికి అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో జాన్ కాంప్‌బెల్ (John Campbell) రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన ట్రెవర్ గొడ్దార్డ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ట్రెవర్ గొడ్దార్డ్ తన తొలి టెస్టు నమోదు చేయడానికి 58 ఇన్నింగ్స్‌లు తీసుకోగా 2018లో అరంగ్రేటం చేసిన జాన్ కాంప్‌బెల్ 50 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఇక ఈ జాబితాలో డారెన్ గంగా, ఇమ్రూల్ కైస్‌లు ఉన్నారు.
ఓపెనర్‌గా టెస్టుల్లో సెంచరీ చేయడానికి అత్యధిక ఇన్నింగ్స్‌లు తీసుకున్న ఆటగాళ్లు వీరే..
* ట్రెవర్ గొడ్దార్డ్ – 58 ఇన్నింగ్స్‌లు
* జాన్ కాంప్‌బెల్ – 50 ఇన్నింగ్స్‌లు
* డారెన్ గంగా – 44 ఇన్నింగ్స్‌లు
* ఇమ్రూల్ కైస్ – 32 ఇన్నింగ్స్‌లు
* బాబ్ సింప్సన్ – 31 ఇన్నింగ్స్‌లు
Ramiz Raja : మైక్ ఆన్‌లో ఉందని మరిచిపోయిన రమీజ్ రాజా..! బాబర్ పై అనుచిత వ్యాఖ్యలు..!
19 ఏళ్ల భారత్ పై విండీస్ ఓపెనర్ సెంచరీ..
తాజా శతకంతో జాన్ కాంప్‌బెల్ మరో రికార్డు సాధించాడు. 19 ఏళ్ల తరువాత భారత్ పై టెస్టు సెంచరీ చేసిన విండీస్ ఓపెనర్‌గా రికార్డుకు ఎక్కాడు. 2006లో డారెన్ గంగా భారత్ పై 135 పరుగులు సాధించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో 199 బంతులు ఆడిన జాన్ కాంప్‌బెల్ 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 115 పరుగులు సాధించి జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు.