Smriti Mandhana : భారత్ మ్యాచ్ ఓడిపోయినా.. స్మృతి మంధాన ప్రపంచ రికార్డులు..
టీమ్ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘనత సాధించింది.

Womens World Cup 2025 IND W vs AUS W Smriti Mandhana Creates Multiple World Records
Smriti Mandhana : టీమ్ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మంధాన 66 బంతుల్లో 80 పరుగులు చేసింది. ఈ క్రమంలో మహిళల వన్డే క్రికెట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.
మహిళల క్రికెట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* స్మృతి మంధాన (భారత్) – 1053 పరుగులు (2025లో)
* బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) – 970 పరుగులు (1997లో)
* లారా వూల్వార్డ్ (దక్షిణాఫ్రికా) – 882 పరుగులు (2022లో)
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఏకంగా వైస్ కెప్టెన్సీ ఛాన్స్..
5వేల పరుగులు..
మంధాన వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకుంది. ఈ క్రమంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా రికార్డు సాధించింది. ఈ క్రమంలో వెస్టిండీస్ ప్లేయర్ స్టెఫైన్ టేలర్ ను అధిగమించింది. టేలర్ 129 మ్యాచ్‌ల్లో వన్డేల్లో 5వేల పరుగుల మైలురాయిని చేరుకోగా మంధాన 112 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించింది. అంతేకాదండోయ్.. మిథాలీ రాజ్ తరువాత వన్డేల్లో 5వేల పరుగులు సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కింది.
మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 5వేల పరుగులు సాధించిన ప్లేయర్లు వీరే..
* స్మృతి మంధాన (భారత్) – 112 ఇన్నింగ్స్‌ల్లో
* స్టెఫైన్ టేలర్ (వెస్టిండీస్) – 129 ఇన్నింగ్స్‌ల్లో
* సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 136 ఇన్నింగ్స్‌ల్లో
* మిథాలీ రాజ్ (భారత్) – 144 ఇన్నింగ్స్‌ల్లో
* షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) – 146 ఇన్నింగ్స్‌ల్లో
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు స్మృతి మంధాన (80), ప్రతీక రావల్ (75) హాఫ్ సెంచరీలు బాదారు. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ ఐదు వికెట్లు తీయగా.. సోఫీ మోలనూ మూడు వికెట్లు పడగొట్టింది.
అనంతరం అలీసా హీలీ (142) భారీ శతకంతో రాణించగా.. ఎలీస్ పెర్రీ (47 నాటౌట్), ఆష్లీ గార్డ్‌నర్ (45), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (40) లు సమయోచితంగా ఆడడంతో 331 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 49 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.