×
Ad

Yashasvi Jaiswal : వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించే అవకాశం..

వెస్టిండీస్‌తో జ‌ర‌గ‌నున్న రెండో టెస్టు మ్యాచ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) చ‌రిత్ర సృష్టించే అవ‌కాశం ఉంది.

IND vs WI 2nd Test Yashasvi Jaiswal has a chance to break Rohit Sharma sixes record

Yashasvi Jaiswal : భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 10) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ టెస్టు మ్యాచ్‌లో గ‌నుక జైస్వాల్ ఏడు సిక్స‌ర్లు కొట్ట‌గ‌లిగితే.. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 సిక్స‌ర్లు కొట్టిన భార‌త ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు.

ఈ క్ర‌మంలో అత‌డు దిగ్గ‌జ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ రికార్డును అధిగ‌మిస్తాడు. రోహిత్ శ‌ర్మ 51 ఇన్నింగ్స్‌ల్లో 50 సిక్స‌ర్లు కొట్టాడు. ఆ త‌రువాతి స్థానంలో రిష‌బ్ పంత్ ఉన్నాడు. పంత్ 54 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త సాధించాడు.

Sanju Samson : ఆసియాక‌ప్‌లో బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్పు పై సంజూ శాంస‌న్ కామెంట్స్‌.. 10 ఏళ్ల‌లో కేవ‌లం 40 మ్యాచ్‌లే..

ఇక య‌శ‌స్వి జైస్వాల్ విష‌యానికి వ‌స్తే.. జైస్వాల్ ఇప్ప‌టి వ‌ర‌కు 25 టెస్టులు ఆడాడు. 47 ఇన్నింగ్స్‌ల్లో 43 సిక్స‌ర్లు బాదాడు. 49.9 స‌గ‌టుతో 2245 ప‌రుగులు సాధించాడు.

టీమ్ఇండియా త‌రుపున టెస్టుల్లో అత్యంత వేగంగా 50 సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

* రోహిత్ శ‌ర్మ – 51 ఇన్నింగ్స్‌ల్లో
* రిష‌బ్ పంత్ – 54 ఇన్నింగ్స్‌ల్లో

ఇక ఓవ‌రాల్‌గా చూసుకుంటే టెస్టుల్లో అత్యంత వేగంగా 50 సిక్స‌ర్లు కొట్టిన రికార్డు పాకిస్తాన్ ఆట‌గాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 46 ఇన్నింగ్స్‌ల్లోనే 50 సిక్స‌ర్లు కొట్టాడు. రెండో స్థానంలో రోహిత్ శ‌ర్మ నిలిచాడు.

Cummins – Head : హెడ్‌, క‌మిన్స్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ బంప‌ర్ ఆఫ‌ర్..! అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికితే.. చెరో రూ.58 కోట్లు..

అహ్మ‌దాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ ప‌ర్వాలేద‌నిపించాడు. 54 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సాయంతో 36 ప‌రుగులు సాధించాడు.