×
Ad

Yashasvi Jaiswal : రెండో ఓవ‌ర్‌లోనే భార‌త్‌కు భారీ షాక్‌.. లేని ప‌రుగు కోసం య‌త్నించి జైస్వాల్ ర‌నౌట్‌..

య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) లేని ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించి ర‌నౌట్ అయ్యాడు.

IND vs WI 2nd test Yashasvi Jaiswal run out on 175 runs

Yashasvi Jaiswal : రెండో రోజు మ్యాచ్ ప్రారంభ‌మైన రెండో ఓవ‌ర్‌లోనే భార‌త్‌కు భారీ షాక్ త‌గిలింది. ఓవ‌ర్ నైట్ బ్యాట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ( 175; 258 బంతుల్లో 22 ఫోర్లు)లేని ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించి ర‌నౌట్ అయ్యాడు.

ఓవ‌ర్ నైట్ స్కోరు 318/2 తో రెండో రోజు భార‌త్ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. తొలి ఓవ‌ర్‌ను ఆండర్సన్ ఫిలిప్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతికి గిల్ ఫోర్ కొట్ట‌గా మొత్తంగా ఏడు ప‌రుగులు వ‌చ్చాయి.

ఇన్నింగ్స్ 92వ ఓవ‌ర్ ను జైడెన్ సీల్స్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతిని య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal ) మిడాఫ్ దిశ‌గా షాట్ ఆడి ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించాడు. ఫీల్డ‌ర్ రావ‌డాన్ని గ‌మ‌నించిన నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ప‌రుగు వ‌ద్ద‌ని వారించారు. అయితే.. అప్ప‌టికే ఆల‌స్య‌మైంది.

IND vs WI 2nd Test : టీ బ్రేక్ స‌మ‌యంలో జైస్వాల్‌కు ఒక‌టే చెప్పాను.. బ్యాటింగ్ సితాన్షు కోట‌క్‌

పిచ్ పై స‌గం ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చిన జైస్వాల్ వెన‌క్కి మ‌ళ్లీ తిరిగి స్ట్రైకింగ్ ఎండ్‌కు ప‌రుగు మొదలుపెట్ట‌గా.. మిడాఫ్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న చంద్ర‌పాల్.. బంతిని అందుకుని స్ట్రైకింగ్ ఎండ్‌లో వికెట్ల వైపుగా త్రో చేశాడు. వికెట్ కీప‌ర్ టెవిన్ ఇమ్లాచ్ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి బంతిని అందుకుని స్టంప్స్‌ను ప‌డ‌గొట్టాడు. అప్ప‌టికి జైస్వాల్ క్రీజులోకి రాలేదు. దీంతో అత‌డు ర‌నౌట్ అయ్యాడు. ఓవ‌ర్ నైట్ స్కోరుకు జైస్వాల్ మ‌రో రెండు ప‌రుగులు మాత్ర‌మే జోడించి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.


దీంతో భార‌త్ 325 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. జైస్వాల్ ఔట్ కావ‌డంతో ఆల్‌రౌండ‌ర్ నితీశ్‌కుమార్ రెడ్డి బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. 93 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ స్కోరు 337/3. గిల్ (33), నితీశ్‌కుమార్ రెడ్డి (4) క్రీజులో ఉన్నారు.