×
Ad

IND vs WI : మూడో రోజు ప్రారంభమైన ఆట‌.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భార‌త్..

అహ్మ‌దాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో (IND vs WI) భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్ స్కోరును డిక్లేర్ చేసింది.

IND vsWI 1st test Team India declare the first innings at 448 score

IND vs WI : అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ప్రారంభ‌మైంది. ఓవ‌ర్ నైట్ స్కోరు 448/5 వ‌ద్దనే తొలి ఇన్నింగ్స్‌ను భార‌త్ డిక్లేర్ చేసింది. 286 ప‌రుగుల లోటుతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌ను (IND vs WI) ప్రారంభించింది.

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 పరుగులకే కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. విండీస్ బ్యాట‌ర్ల‌లో జస్టిన్‌ గ్రీవ్స్‌ (32; 48 బంతుల్లో 4 ఫోర్లు), షై హోప్‌ (26; 36 బంతుల్లో 3 ఫోర్లు), రోస్టన్‌ చేజ్‌ (24; 43 బంతుల్లో 4 ఫోర్లు)లు ప‌ర్వాలేద‌నిపించారు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు. జ‌స్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. కుల్దీప్ యాద‌వ్ రెండు, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఓ వికెట్ సాధించాడు.

Chappell Hadlee Trophy : ఆస్ట్రేలియాకు వ‌రుణుడి సాయం.. చాపెల్-హాడ్లీ ట్రోఫీని నిలబెట్టుకుంది

ఆ త‌రువాత మొద‌టి ఇన్నింగ్స్ ను భార‌త్ ఆరంభించింది. కేఎల్‌ రాహుల్‌ (100; 190 బంతుల్లో 12 ఫోర్లు), ధ్రువ్‌ జురేల్‌ (125; 210 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), రవీంద్ర జడేజా (104 నాటౌట్‌; 176 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) శ‌త‌కాల‌తో చెల‌రేగ‌డంతో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 448 ప‌రుగులు చేసింది. ర‌వీంద్ర జ‌డేజాతో పాటు వాషింగ్ట‌న్ సుంద‌ర్ (9 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. కాగా.. అదే స్కోరు వ‌ద్ద ఒక్క బంతిని కూడా ఆడ‌కుండానే భార‌త్ మూడో రోజు త‌న ఇన్నింగ్ డిక్లేర్ చేసింది.