Chappell Hadlee Trophy : ఆస్ట్రేలియాకు వ‌రుణుడి సాయం.. చాపెల్-హాడ్లీ ట్రోఫీని నిలబెట్టుకుంది

న్యూజిలాండ్‌తో జ‌ర‌గాల్సిన రెండో టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దుకావ‌డంతో ఆసీస్ చాపెల్-హాడ్లీ ట్రోఫీని (Chappell Hadlee Trophy) నిల‌బెట్టుకుంది.

Chappell Hadlee Trophy : ఆస్ట్రేలియాకు వ‌రుణుడి సాయం.. చాపెల్-హాడ్లీ ట్రోఫీని నిలబెట్టుకుంది

Australia Retain Chappell-Hadlee Trophy After 2nd T20I Washout against NZ

Updated On : October 3, 2025 / 4:06 PM IST

Chappell-Hadlee Trophy : ప్ర‌తిష్టాత్మ‌క చాపెల్-హాడ్లీ ట్రోఫీని ఆస్ట్రేలియా నిల‌బెట్టుకుంది. శుక్ర‌వారం న్యూజిలాండ్‌తో మౌంట్ మౌంగనుయ్ వేదిక‌గా జ‌ర‌గాల్సిన రెండో టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డం ఆసీస్‌కు క‌లిసి వ‌చ్చింది.

వ‌ర్షం కార‌ణంగా ఈ మ్యాచ్ చాలా ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. వ‌ర్షం వ‌ల్ల చాలా స‌మ‌యం కోల్పోవ‌డంతో 20 ఓవ‌ర్ల మ్యాచ్‌ను 9 ఓవ‌ర్ల‌కు కుదించారు. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 2.1 ఓవ‌ర్ల ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోయి 16 ప‌రుగులు చేసింది. ఈ స‌మ‌యంలో మ‌రోసారి భారీ వ‌ర్షం కురిసింది.

Abhishek Sharma : విఫ‌ల‌మైన అభిషేక్ శ‌ర్మ.. గోల్డెన్ డ‌క్‌.. టీ20ల్లోనే మ‌నోడి ప్రతాప‌మంతా! వ‌న్డేల్లో తుస్సే..!

మ్యాచ్ నిర్వ‌హించే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంత‌క‌ముందు బుధ‌వారం ఇదే మైదానంలో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్ర‌మంలో శ‌నివారం జ‌ర‌గ‌నున్న మూడో టీ20 మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఆస్ట్రేలియా చాపెల్-హాడ్లీ ట్రోఫీని నిల‌బెట్టుకుంటుంది.

Ravindra Jadeja : ర‌వీంద్ర జ‌డేజా అరుదైన ఘ‌న‌త.. ఎంఎస్ ధోని సిక్స‌ర్ల రికార్డు బ్రేక్‌..

చాపెల్-హాడ్లీ ట్రోఫీ (Chappell-Hadlee Trophy)ని 2004 నుంచి నిర్వ‌హిస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు ఈ ట్రోఫీ పేరు పెడుతున్నారు. ఇరు దేశాల దిగ్గ‌జ క్రికెట‌ర్ల పేరుతో దీన్ని నిర్వ‌హిస్తున్నారు. కాగా.. 2019 నుంచి ఈ ట్రోఫీ ఆస్ట్రేలియా వ‌ద్ద‌నే ఉంటూ వ‌స్తోంది.