Australia Retain Chappell-Hadlee Trophy After 2nd T20I Washout against NZ
Chappell-Hadlee Trophy : ప్రతిష్టాత్మక చాపెల్-హాడ్లీ ట్రోఫీని ఆస్ట్రేలియా నిలబెట్టుకుంది. శుక్రవారం న్యూజిలాండ్‌తో మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం ఆసీస్‌కు కలిసి వచ్చింది.
వర్షం కారణంగా ఈ మ్యాచ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం వల్ల చాలా సమయం కోల్పోవడంతో 20 ఓవర్ల మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 2.1 ఓవర్ల ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 16 పరుగులు చేసింది. ఈ సమయంలో మరోసారి భారీ వర్షం కురిసింది.
Just wasn’t meant to be tonight – but Australia retain the Chappell-Hadlee Trophy: https://t.co/CCmbl3W9WD#NZvAUS pic.twitter.com/kAC5gPpq71
— cricket.com.au (@cricketcomau) October 3, 2025
మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకముందు బుధవారం ఇదే మైదానంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో శనివారం జరగనున్న మూడో టీ20 మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఆస్ట్రేలియా చాపెల్-హాడ్లీ ట్రోఫీని నిలబెట్టుకుంటుంది.
Ravindra Jadeja : రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ఎంఎస్ ధోని సిక్సర్ల రికార్డు బ్రేక్..
చాపెల్-హాడ్లీ ట్రోఫీ (Chappell-Hadlee Trophy)ని 2004 నుంచి నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు ఈ ట్రోఫీ పేరు పెడుతున్నారు. ఇరు దేశాల దిగ్గజ క్రికెటర్ల పేరుతో దీన్ని నిర్వహిస్తున్నారు. కాగా.. 2019 నుంచి ఈ ట్రోఫీ ఆస్ట్రేలియా వద్దనే ఉంటూ వస్తోంది.