Ravindra Jadeja : రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ఎంఎస్ ధోని సిక్సర్ల రికార్డు బ్రేక్..
టీమ్ఇండియ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు.

Most sixes in Tests by Indians Ravindra Jadeja overtakes MS Dhoni
Ravindra Jadeja : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో టీమ్ఇండియా తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనిని అధిగమించాడు. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగో సిక్సర్ కొట్టిన అనంతరం ఈ ఘనత అందుకున్నాడు జడ్డూ (Ravindra Jadeja).
ఎంఎస్ ధోని 90 టెస్టుల్లో 144 ఇన్నింగ్స్‌ల్లో 78 సిక్సర్లు కొట్టగా.. జడేజా 86 మ్యాచ్‌ల్లో 129 ఇన్నింగ్స్‌ల్లో 79 సిక్సర్లు బాదాడు. టెస్టుల్లో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు రిషబ్ పంత్, సెహ్వాగ్ ల పేరిట ఉంది. పంత్ 47 మ్యాచ్‌ల్లో 82 ఇన్నింగ్స్‌ల్లో 90 సిక్సర్లు కొట్టాడు. సెహ్వాగ్ 103 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు బాదాడు. ఆ తరువాత రోహిత్ శర్మ మాత్రమే జడ్డూ కన్నా ముందు ఉన్నారు.
టెస్టుల్లో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
* రిషబ్ పంత్ – 47 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు
* వీరేంద్ర సెహ్వాగ్ – 103 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు
* రోహిత్ శర్మ – 67 మ్యాచ్‌ల్లో 88 సిక్సర్లు
* రవీంద్ర జడేజా – 86 మ్యాచ్‌ల్లో 79 సిక్సర్లు
* ఎంఎస్ ధోని – 90 మ్యాచ్‌ల్లో 78 సిక్సర్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌ల్లో 162 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు టీ విరామ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (68 నాటౌట్), రవీంద్ర జడేజా (50) క్రీజులో ఉన్నారు.