×
Ad

Smriti Mandhana : ‘గెలిచే మ్యాచ్‌లో నా వ‌ల్లే ఓడిపోయాం.. త‌ప్పంతా నాదే..’ స్మృతి మంధాన షాకింగ్ కామెంట్స్‌..

ఇంగ్లాండ్ పై ఓట‌మికి తానే నైతిక బాధ్య‌త వ‌హిస్తాన‌ని వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ( Smriti Mandhana ) తెలిపింది.

IND W vs ENG W Smriti Mandhana takes responsibility for poor shot selection

Smriti Mandhana : ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో భార‌త్‌కు మ‌రో ఓట‌మి ఎదురైంది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో భార‌త్ నాలుగు ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ టోర్నీలో టీమ్ఇండియా మ్యాచ్ ఓడిపోవ‌డం వ‌రుస‌గా ఇది మూడోసారి. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టు సెమీస్ అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి.

మ్యాచ్ అనంత‌రం ఇంగ్లాండ్ చేతిలో ఓట‌మిపై టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్‌, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) స్పందించింది. త‌న త‌ప్పిదం వ‌ల్లే మ్యాచ్ ఓడినట్లుగా చెప్పుకొచ్చింది. త‌ను ఇంకాస్త బాధ్య‌తాయుతంగా ఆడి ఉంటే గెలిచి ఉండేవాళ్ల‌మ‌ని అభిప్రాయ‌ప‌డింది.

Rohit sharma : ఆస్ట్రేలియాతో రెండో వ‌న్డే.. రోహిత్ శ‌ర్మ 2 ప‌రుగులు చేస్తే.. చ‌రిత్ర..

హీథర్ నైట్ (109) శ‌త‌కం బాద‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 288 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత 289 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 284 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో స్మృతి మంధాన (88; 94 బంతుల్లో 8 ఫోర్లు), హర్మన్‌ప్రీత్‌ కౌర్ (70; 70 బంతుల్లో 10 ఫోర్లు), దీప్తి శర్మ (57 బంతుల్లో 50 ప‌రుగులు) లు రాణించారు.

ఈ మ్యాచ్‌లో మంధాన కీల‌క‌ భాగ‌స్వామ్యాలు న‌మోదు చేసింది. కెప్టెన్ హ‌ర్మ‌న్‌తో క‌లిసి 125 ప‌రుగులు, దీప్తితో క‌లిసి 67 ప‌రుగుల భాగ‌స్వామ్యాల‌ను అందించింది. అయితే.. కీల‌క స‌మ‌యంలో లాంగ్ ఆఫ్ దిశ‌గా లాఫ్టెడ్ షాట్ ఆడి ఔట్ అయింది. ఆ త‌రువాత రిచా ఘోష్, దీప్తి శ‌ర్మలు కూడా పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. ఆఖ‌రి వ‌రుస బ్యాట‌ర్లు ఒత్తిడి జ‌యించ‌క‌పోవ‌డంతో భార‌త్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

IND vs AUS : అత‌డిని ఎందుకు దాస్తున్నారు.. ఎక్స్‌పోజ్ చేయండి.. బుమ్రా లేన‌ప్పుడైనా..

మ్యాచ్ అనంత‌రం మంధాన మాట్లాడుతూ.. వాస్త‌వానికి ఈ మ్యాచ్‌లో అంద‌రి షాట్ సెలక్ష‌న్ స‌రిగా లేదని చెప్పింది. త‌న షాట్ సెల‌క్ష‌న్ మ‌రింత మెరుగ్గా ఉండాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డింది. తాము ఓవ‌ర్‌కు కేవ‌లం 6 ప‌రుగులు సాధిస్తే గెలిచేవాళ్ల‌మ‌ని చెప్పుకొచ్చింది. తన వికెట్‌తోనే వికెట్ల ప‌త‌నం ప్రారంభమైంద‌ని తెలిపింది.

ఇక తాను ఆ స‌మ‌యంలో అలాంటి షాట్ ఆడ‌కుండా ఉండాల్సింది అని చెప్పింది. తాను ఇంకాస్త ఓపికగా బ్యాటింగ్ చేసి ఉంటో మ్యాచ్ ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని స్మృతి మంధాన అంది.