IND vs AUS : అత‌డిని ఎందుకు దాస్తున్నారు.. ఎక్స్‌పోజ్ చేయండి.. బుమ్రా లేన‌ప్పుడైనా..

ఆదివారం ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లోనూ (IND vs AUS) హ‌ర్షిత్ రాణా విఫ‌లం అయ్యాడు.

IND vs AUS : అత‌డిని ఎందుకు దాస్తున్నారు.. ఎక్స్‌పోజ్ చేయండి.. బుమ్రా లేన‌ప్పుడైనా..

Former India A captain Priyank Panchal to send a big message to the team management

Updated On : October 20, 2025 / 11:05 AM IST

IND vs AUS : గ‌త కొన్నాళ్లుగా టీమ్ఇండియా యువ పేస‌ర్ హ‌ర్షిత్ రాణా పేరు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. గంభీర్ ప్రియ‌శిష్యుడు కావ‌డంతోనే అత‌డికి భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కుతుంద‌ని చాలా మంది విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా హ‌ర్షిత్ త‌న పై వస్తున్న విమ‌ర్శ‌ల‌కు ఆట‌తో స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నాడు.

ఇక ఆదివారం ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లోనూ (IND vs AUS) హ‌ర్షిత్ రాణా విఫ‌లం అయ్యాడు. 9 స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అత‌డు రెండు బంతుల్లో ఒక్క ప‌రుగు చేశాడు. ఆ త‌రువాత బౌలింగ్‌లో నాలుగు ఓవ‌ర్లు వేసి 24 ప‌రుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు.

Harmanpreet Kaur : అదే ట‌ర్నింగ్ పాయింట్‌.. ఓడిపోయిన‌ప్ప‌టికి కూడా.. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కామెంట్స్‌..

ఈ క్ర‌మంలో నేపథ్యంలో హ‌ర్షిత్ రాణాకు టీమ్ మేనేజ్‌మెంట్ ప్రాధాన్యం ఇవ్వ‌డాన్ని భారత-‘ఎ’ జట్టు మాజీ కెప్టెన్‌ ప్రియాంక్‌ పాంచల్ సోషల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శించాడు. ‘ఒక‌వేళ మీరు హ‌ర్షిత్ రాణాను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయ‌డం కోసం తీసుకుంటే.. ఆ స్థానంలోనే అత‌డిని ఆడ‌నివ్వాలి. త‌న‌ను తాను నిరూపించుకునేందుకు అవ‌కాశం ఇవ్వాలి. రెండేళ్ల పాటు అత‌డిని ఆ పాత్ర‌లో కొన‌సాగించాలి. అంతేగానీ.. అద‌న‌పు బ్యాట‌ర్‌ను తీసుకుని హ‌ర్షిత్ ను కాపాడ‌డం ఎందుకు.’ అని పాంచ‌ల్ ప్ర‌శ్నించాడు.

‘ఆల్‌రౌండర్లు నితీశ్‌ రెడ్డి లేదా వాషింగ్టన్‌ సుందర్ ల‌లో ఒక‌రి స్థానంలో కుల్దీప్ యాద‌వ్‌ను తుది జ‌ట్టులోకి తీసుకుని ఉంటే బాగుండేది. టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా లేన‌ప్పుడు అత‌డు వికెట్లు తీసేవాడు.’ అని పాంచ‌ల్ చెప్పుకొచ్చాడు.

Smriti Mandhana : ఇంగ్లాండ్ పై స్వ‌ల్ప తేడాతో ఓట‌మి.. భావోద్వేగానికి గురైన స్మృతి మంధాన‌.. నిన్ను అలా చూడ‌లేక‌పోతున్నాం..

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ప‌లు మార్లు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించ‌డంతో మ్యాచ్‌ను 26 ఓవ‌ర్ల‌కు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 136 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో ఆసీస్ ల‌క్ష్యాన్ని 131 ప‌రుగులుగా నిర్ధారించారు. ఈ లక్ష్యాన్ని ఆసీస్ 21.1 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.