Smriti Mandhana : ఇంగ్లాండ్ పై స్వ‌ల్ప తేడాతో ఓట‌మి.. భావోద్వేగానికి గురైన స్మృతి మంధాన‌.. నిన్ను అలా చూడ‌లేక‌పోతున్నాం..

ఇంగ్లాండ్ పై స్వ‌ల్ప తేడాతో ఓడిపోవ‌డంతో స్మృతి మంధాన ( Smriti Mandhana) భావోద్వేగానికి గురైంది.

Smriti Mandhana : ఇంగ్లాండ్ పై స్వ‌ల్ప తేడాతో ఓట‌మి.. భావోద్వేగానికి గురైన స్మృతి మంధాన‌.. నిన్ను అలా చూడ‌లేక‌పోతున్నాం..

Womens World Cup 2025 Smriti Mandhana got emotional when India lost match against England

Updated On : October 20, 2025 / 9:33 AM IST

Smriti Mandhana : ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో (Womens World Cup 2025 ) భార‌త్‌కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లోనూ విజ‌యానికి చేరువ‌గా వ‌చ్చి ఓడిపోయింది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ నాలుగు ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 288 ప‌రుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో హీథర్ నైట్ (109; 91 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచ‌రీ చేశారు. అమీ జోన్స్‌ (56), నాట్‌ సీవర్‌ (38) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో దీప్తిశ‌ర్మ నాలుగు వికెట్లు తీసింది. శ్రీచ‌ర‌ణి రెండు వికెట్లు ప‌డ‌గొట్టింది.

Shubman Gill : అందుక‌నే తొలి వ‌న్డేలో ఓడిపోయాం.. లేదంటేనా.. గిల్ కామెంట్స్‌..

ఆ త‌రువాత 289 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 284 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో స్మృతి మంధాన (88; 94 బంతుల్లో 8 ఫోర్లు), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (70; 70 బంతుల్లో 10 ఫోర్లు), దీప్తి శర్మ (50; 57 బంతుల్లో 5 ఫోర్లు) లు రాణించారు. ఇంగ్లీష్ బౌల‌ర్ల‌లో నాట్ సీవ‌ర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టింది.

వాస్త‌వానికి ల‌క్ష్య ఛేద‌న‌లో స్మృతి మంధాన క్రీజులో ఉన్నంత వ‌ర‌కు భార‌త్ ఈజీగా గెలుస్తుంద‌ని అనిపించింది. ఆమె 42 ఓవ‌ర్‌లో రెండో బంతికి ఔట్ అయింది. అప్ప‌టికి భార‌త్ స్కోరు 234 ప‌రుగులు. స్మృతి ఔటైన త‌రువాత టీమ్ఇండియా బ్యాట‌ర్లు ఒత్తిడికి లోనైయ్యారు. మ‌రోవైపు ఇంగ్లీష్ బౌల‌ర్లు క‌ట్టు దిట్టంగా బౌలింగ్ వేయ‌డంతో ప‌రుగుల రాక మంద‌గించింది. అదే స‌మ‌యంలో రిచా ఘోష్(8), దీప్తి శ‌ర్మ‌లు ఔట్ అయ్యారు.

6 బంతుల్లో 14 ప‌రుగులు..

భార‌త విజ‌యానికి ఆఖ‌రి ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. అమన్జోత్ కౌర్, స్నేహ్ రాణా లు తొలి మూడు బంతుల్లో మూడు సింగిల్స్ తీయ‌డంతో భార‌త్ ప‌రాజ‌యం ఖ‌రారైంది. నాలుగో బంతి డాట్ కాగా.. అయిదో బంతికి రెండు ప‌రుగులు వ‌చ్చాయి. ఆఖ‌రి బంతికి బౌండ‌రీ వ‌చ్చింది. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులే రావ‌డంతో భార‌త్ 4 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

భావోద్వేగానికి గురైన స్మృతి..

ఇక ఈ మ్యాచ్‌లో భార‌త్ విజ‌య‌తీరాల‌కు వ‌చ్చి ఓడిపోవ‌డంతో టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్ స్మృతి మంధాన (Smriti Mandhana) భావోద్వేగానికి గురైంది. క‌న్నీళ్ల‌ను తుడుచుకుంటూ క‌నిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. నిన్ను అలా చూడ‌లేక‌పోతున్నాం అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.