×
Ad

india A vs australia A: ఏం కొట్టారు భయ్యా.. ఆస్ట్రేలియా బౌలర్లను చితకబాదిన శ్రేయాస్ అయ్యర్, ప్రియాంష్ ఆర్య.. ఏకంగా 171 పరుగుల తేడాతో..

india A vs australia A : భారత్ -ఏ వర్సెస్ ఆస్ట్రేలియా -ఏ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలి అనధికారిక వన్డేలో..

india A vs australia A : భారత్ -ఏ వర్సెస్ ఆస్ట్రేలియా -ఏ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలి అనధికారిక వన్డేలో భారత్-ఏ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లకు భారత బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఏకంగా 171 పరుగుల తేడాతో విజయం సాధించారు. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్యలు ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోతకోశారు. స్టేడియం చుట్టూ బౌండరీల వర్షం కురిపించారు.

భారత్ -ఏ వర్సెస్ ఆస్ట్రేలియా -ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 413 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ 83 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ప్రియాన్ష్ ఆర్య 84బంతుల్లో 101 రన్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్ల, ఐదు సిక్సులు కొట్టాడు. వీరిద్దరూ సెంచరీలతో చెలరేగడంతో భారత్ -ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. వీరితోపాటు పాటు ప్రభ్ సిమ్రాన్ సింగ్ (56), రియాన్ పరాగ్ (67), ఆయుష్ బదోని (50)లు హాఫ్ సెంచరీలతో ఆసీస్ బౌలర్లను హడలెత్తించారు.

భారీ పరుగుల లక్ష్యతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్-ఏ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఆసీస్ ఓపెనింగ్ బ్యాటర్ మెకెంజీ హార్వే (68) రాణించినప్పటికీ మిగిలిన బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయారు. సదర్లాండ్ (50), లాచ్లాన్ షా (45) పర్వాలేదనిపించారు. దీంతో 414 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు కేవలం 33.1 ఓవర్లలోనే 242 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.

భారత్ బౌలర్లలో నిశాంత్ సింధూ నాలుగు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అతను మొత్తం 6.1ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. రవి బిష్ణోవ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సిమ్రాన్ జీత్ సిగ్, యుద్ధ్ వీర్ సింగ్, ఆయుష్ బదోని తలా ఒక వికెట్ పడగొట్టారు.