Asia Cup 2025 : ఫ్యాన్స్‌కు పండ‌గే.. ఒక్క‌సారి కాదు.. ఏకంగా మూడు సార్లు త‌ల‌ప‌డ‌నున్న భార‌త్‌, పాక్‌!

ఆసియాక‌ప్ 2025 (Asia Cup 2025) టోర్నీలో భార‌త్‌, పాక్ జ‌ట్లు మూడు మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

India and Pakistan could meet three times in Asia Cup 2025

Asia Cup 2025 : నేటి నుంచి (సెప్టెంబ‌ర్ 9) ఆసియాక‌ప్ 2025 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో హాంగ్‌కాంగ్ త‌ల‌ప‌డ‌నుంది. మొత్తం 8 జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూప్‌-ఏలో భార‌త్‌, పాకిస్తాన్‌, యూఏఈ, ఒమ‌న్ లు ఉండ‌గా గ్రూప్‌-బిలో శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్, హాంకాంగ్‌లు ఉన్నాయి.

టీమ్ఇండియా త‌న తొలి మ్యాచ్‌ను సెప్టెంబ‌ర్ 10న ఆతిథ్య యూఏఈతో ఆడ‌నుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 14న మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. గ్రూప్‌ ద‌శ‌లో భార‌త్ సెప్టెంబ‌ర్ 19న ఒమ‌న్‌తో చివ‌రి మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో క‌నీసం రెండింటిలో గెలిచిన కూడా భార‌త్ సూప‌ర్ 4కు అర్హ‌త సాధిస్తుంది.

Gautam Gambhir : ఆసియాకప్ కోసం కేకేఆర్ బ్యాగ్ తీసుకువెళ్లిన గౌత‌మ్ గంభీర్‌..

అటు పాకిస్తాన్ సెప్టెంబ‌ర్ 12న ఒమ‌న్‌తో ఆడ‌నుంది. ఆ త‌రువాత భార‌త్‌తో సెప్టెంబ‌ర్ 14న త‌ల‌ప‌డ‌నుంది. గ్రూప్ ద‌శ‌లో చివ‌రి మ్యాచ్‌ను సెప్టెంబ‌ర్ 17న యూఏఈతో ఆడ‌నుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో క‌నీసం రెండింటిలో విజ‌యం సాధిస్తే పాక్ సూప‌ర్ 4 కు అర్హ‌త సాధిస్తుంది.

మూడు సార్లు త‌ల‌ప‌డ‌నున్న భార‌త్‌, పాక్‌?
ఆసియా క‌ప్‌(Asia Cup 2025)లో భార‌త్‌, పాక్ జ‌ట్లు మూడు సార్లు త‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది.

* లీగ్ ద‌శ‌లో సెప్టెంబ‌ర్ 14న దుబాయ్‌లో భార‌త్‌, పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.
* భార‌త్‌, పాక్ జ‌ట్లు రెండు కూడా సూప‌ర్ ఫోర్‌కి అర్హ‌త సాధిస్తే మ‌రోసారి సెప్టెంబ‌ర్ 21 త‌ల‌ప‌డ‌నున్నాయి.
* ఇక రెండు జ‌ట్లు కూడా ఫైన‌ల్ కు చేరితే.. సెప్టెంబ‌ర్ 28న ముచ్చ‌ట‌గా మూడోసారి త‌లప‌డ‌తాయి.

Shubman Gill-Simranjeet Singh : గిల్ చిన్న‌ప్పుడు అత‌డికి బౌలింగ్ చేశా.. ఇప్పుడు ప్ర‌త్య‌ర్థిగా ఆడుతున్నా.. అత‌డికి గుర్తున్నానో లేదో తెలియ‌దు..

డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో పాకిస్థాన్‌పై ఆధిక్యంలో ఉంది. భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య 13 టీ20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌గా 10 మ్యాచ్‌ల్లో భార‌త్ గెలుపొందింది.