WTC Final : భారత తుది జట్టు ఎంపిక

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత తుది జట్టు ఎంపిక చేశారు. కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ, గిల్, పుజారా, రహానె, పంత్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, ఇషాంత్, బుమ్రా, షమీలు జట్టులో స్థానం సంపాదించారు. జట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు.

India VS New Zealand : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత తుది జట్టు ఎంపిక చేశారు. కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ, గిల్, పుజారా, రహానె, పంత్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, ఇషాంత్, బుమ్రా, షమీలు జట్టులో స్థానం సంపాదించారు. జట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం క్రీడాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్, – భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. తొలిసారి నిర్వహిస్తున్న ఈ టెస్టు ఛాంపియన్ షిప్ ట్రోఫిని దక్కించుకోవడానికి విరాట్ టీం, కేన్ విలియమ్ సన్ టీం తహతహలాడుతున్నాయి. ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు విశ్లేషకులు. న్యూజిలాండ్ తో జరిగే ఫైనల్ కోసం బీసీసీఐ ఇటీవలే 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే..ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండడం అభిమానులను కలవర పెడుతోంది. మరోవైపు ఫైనల్‌లో వరుణుడే లాంగ్ ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ జరిగే ఐదురోజుల్లోనూ వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ చెబుతోంది. రిజర్వే డే ఉన్నా అది ఎంతమేర ఉపయోగపడుతుందన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ మ్యాచ్‌ రద్దయినా..లేకపోతే డ్రా అయినా ట్రోఫీని ఇరు జట్లు పంచుకుంటాయి.

ట్రెండింగ్ వార్తలు