×
Ad

India Beat West Indies : మహిళల టీ20 వరల్డ్ కప్ : వెస్టిండీస్ పై భారత్ విజయం

మహిళల టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ పై భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ పై 6వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు గెలుపొందింది.

  • Published On : February 15, 2023 / 11:40 PM IST

India beat West Indies

India Beat West Indies : మహిళల టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ పై భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ పై 6వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు గెలుపొందింది. దీంతో టీ20 ప్రపంచ కప్ లో రెండో మ్యాచ్ ను కూడా భారత్ తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్  ఆరు వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 118 పరుగులు చేసింది. టేలర్ 42, క్యామ్ బెల్లి 30, సి.నేషన్ 21 పరుగుల చొప్పున చేశారు.

భారత్ బౌలర్లు దీప్తిశర్మ 3, పూజ, రేణుకా ఠాకూర్ కు చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టు 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. రిచా ఘోశ్ 44, హర్మన్ ప్రీత్ కౌర్ 33, షపాలీవర్మ 28 పరుగుల చొప్పున చేశారు. వెస్టిండీస్ బౌలిర్లు కరిష్మా 2, మాథ్యూస్, హెన్రీకి చెరో వికెట్ తీశారు.

IND vs PAK T20 World Cup : ఆడ పులులు అదరహో.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం

అంతర్జాతీయ క్రికెట్ లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్ గా దీప్తి శర్మ నిలిచింది. ఇప్పటివరకు ఏ క్రికెటర్ ఈ ఘతనను సాధించకపోవడం గమనార్హం. ఆమెకు ముందు పూనమ్ యాదవ్ అత్యదికంగా 98 వికెట్లు తీశారు. కాగా, పురుషుల క్రికెట్ లో యజ్వేంద్ర చాహల్ 91 వికెట్లను, భువనేశ్వర్ 90 వికెట్లను తీశారు. ఇది దీప్తి ఆడిన 89వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్.

వెస్టిండీస్ స్కోర్ : 118/6, భారత్ : 119/4
వెస్టిండీస్ బ్యాటింగ్: టేలర్ 42, క్యామ్ బెల్లి 30, సి.నేషన్ 21
భారత్ బౌలింగ్: దీప్తిశర్మకు3, పూజ, రేణుకా ఠాకూర్ చెరో వికెట్
భారత్ బ్యాటింగ్ : రిచా ఘోశ్ 44, హర్మన్ ప్రీత్ కౌర్ 33, షపాలీవర్మ 28
వెస్టిండీస్ బౌలర్లు : కరిష్మా 2, మాథ్యూస్, హెన్రీకి చెరో వికెట్