Team India : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. మొన్న ప్ర‌పంచ‌క‌ప్‌.. ఇప్పుడేమో ఏకంగా..

పొట్టి ఫార్మాట్‌లో ప్ర‌స్తుతం టీమ్ఇండియా హ‌వా న‌డుస్తోంది.

PIC Credit : BCCI

పొట్టి ఫార్మాట్‌లో ప్ర‌స్తుతం టీమ్ఇండియా హ‌వా న‌డుస్తోంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024ను భార‌త్ కైవ‌సం చేసుకుంది. ప్ర‌స్తుతం జింబాబ్వేతో జ‌రుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లోనూ ఓ అద్భుత రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. బుధ‌వారం జింబాబ్వేతో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా 23 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. కాగా.. టీ20ల్లో భార‌త జ‌ట్టుకు ఇది 150వ‌ గెలుపు కావ‌డం విశేషం.

ఈ క్ర‌మంలో పొట్టి ఫార్మాట్‌లో 150 విజ‌యాలు సాధించిన తొలి జట్టుగా భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 230టీ20 మ్యాచులు ఆడిన భార‌త్ 150 మ్యాచుల్లో గెలిచింది. ఇక భార‌త్ త‌రువాత పొట్టి ఫార్మాట్‌లో అత్య‌ధిక విజ‌యాలు సాధించిన జ‌ట్టుగా పాకిస్తాన్ ఉంది. పాక్ 142 మ్యాచుల్లో గెలిచింది. ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికాలు వ‌రుస‌గా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.

పాకిస్థాన్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందా? బీసీసీఐ వర్గాలు ఏం చెప్పాయంటే?

టీ20ల్లో అత్య‌ధిక విజ‌యాలు సాధించిన జ‌ట్లు ఇవే..

భారత్ – 230 మ్యాచులు ఆడ‌గా 150 మ్యాచుల్లో విజ‌యం
పాకిస్థాన్ – 245 మ్యాచులు ఆడ‌గా 142 మ్యాచుల్లో గెలుపు
న్యూజిలాండ్ – 220 మ్యాచులు ఆడ‌గా 111 మ్యాచుల్లో విజ‌యం
ఆస్ట్రేలియా – 195 మ్యాచులు ఆడ‌గా 105 మ్యాచుల్లో విజ‌యం
దక్షిణాఫ్రికా – 185 మ్యాచులు ఆడ‌గా 104 మ్యాచుల్లో గెలుపు

బుధ‌వారం జరిగిన భార‌త్, జింబాబ్వే టీ20 మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో భార‌త్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది. గిల్ (66), రుతురాజ్ గైక్వాడ్ (49), యశస్వి జైస్వాల్ (36) లు రాణించారు. జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ, సికింద‌ర్ ర‌జాలు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులకే ప‌రిమిత‌మైంది.

పాకిస్థాన్ కోచ్‌లతో షాహీన్ షా అఫ్రిది దురుసు ప్రవర్తన!

దీంతో భార‌త్ 23 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో డియోన్ మైర్స్(65 నాటౌట్), క్లైవ్ మదండే(37) రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ మూడు వికెట్లు, ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీశారు. ఈ విజ‌యంతో భార‌త్ 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

ట్రెండింగ్ వార్తలు