Rohit Sharma: రోహిత్ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా డేవిడ్ వార్నర్ ఫన్నీ కామెంట్రీ.. వీడియో వైరల్

ఆదివారం ఆస్ట్రేలియాలోని పెర్త్ కు చేరుకున్న రోహిత్ శర్మ సోమవారం ఉదయం నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Rohit Sharma nets practices

David Warner Covering Rohit Sharmas Net Session: ఆస్ట్రేలియాతో ఆడిలైడ్ లో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత జట్టుతో జతకట్టేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ కు చేరుకున్న విషయం తెలిసిందే. పెర్త్ లోని ఆప్టస్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్టు నాలుగో రోజు ఆటలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో కలిసి రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూంలో కూర్చొని కనిపించాడు. రోహిత్ శర్మ సతీమణి రితికా రెండో సంతానంలో ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తన కుటుంబంతో గడిపేందుకు రోహిత్ ముంబైలో ఉండటంతో పెర్త్ లో జరిగిన మొదటి టెస్టుకు గైర్హాజరయ్యాడు. రోహిత్ స్థానంలో జస్ర్పీత్ బుమ్రా కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

Also Read: Tilak Varma: అయ్యో.. తిలక్ వర్మ ఎంత పనిచేశావ్..! వేలంలో ఉండిఉంటే..

ఆదివారం ఆస్ట్రేలియాలోని పెర్త్ కు చేరుకున్న రోహిత్ శర్మ సోమవారం ఉదయం నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఈనెల 30వ తేదీ నుంచి కాన్బెర్రాలోని ఓవల్ మైదానంలో రెండు రోజులు జరిగే డై-నైట్ వార్మప్ మ్యాచ్ కోసం రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. రోహిత్ గులాబీ బంతితో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ రోహిత్ ను చూపిస్తూ ఫాక్స్ క్రికెట్ మీడియాకోసం కవర్ చేస్తున్నాడు. వార్నర్ మాట్లాడుతూ.. ‘ ఇండియా – ఆస్ట్రేలియా మొదటి టెస్టు నాల్గోరోజు ఆటలో భోజన విరామ సమయంలో మాకు భారత కెప్టెన్ ఉన్నారు.. రోహిత్ శర్మ ఇప్పుడే ఆస్ట్రేలియాకు వచ్చారు. నెట్స్ లో టీమిండియాకు చెందిన బౌలర్లు వేస్తున్న పదునైన బంతులకు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు’ అంటూ వార్నర్ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: IPL 2025 Auction: ఐపీఎల్ జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు.. తొలిరోజు వేలంలో దక్కించుకున్న ప్లేయర్స్ ఫుల్ లిస్ట్ ఇదే ..

నెట్స్ లో రోహిత్ శర్మ రిజర్వ్ లో ఉన్న టీమిండియా బౌలర్ ముఖేశ్ కుమార్ బౌలింగ్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రోహిత్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన వెంటనే ప్రాక్టీస్ మొదలెట్టాడు.. రెండో టెస్టులో రోహిత్ పరుగుల వరద ఖాయమని పేర్కొంటూ కామెంట్స్ చేస్తున్నారు.