IPL 2025 Auction: ఐపీఎల్ జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు.. తొలిరోజు వేలంలో దక్కించుకున్న ప్లేయర్స్ ఫుల్ లిస్ట్ ఇదే ..
ఐపీఎల్ వేలం 2025లో ఆటగాళ్లకు కాసుల పంట పడింది. సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో ఆదివారం నిర్వహించిన తొలిరోజు వేలంలో 10 జట్లు మొత్తం 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.

IPL 2025 Auction
IPL 2025 Auction Full list: ఐపీఎల్ వేలం 2025లో ఆటగాళ్లకు కాసుల పంట పడింది. సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో ఆదివారం నిర్వహించిన తొలిరోజు వేలంలో 10 జట్లు మొత్తం 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం ప్రాంచైజీలు రూ.467.95 కోట్లు వెచ్చించాయి. అత్యధికంగా లక్నో జట్టు రిషబ్ పంత్ ను రూ. 27కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను దక్కించుకున్న ప్లేయర్ గా రిషబ్ పంత్ నిలిచాడు. శ్రేయర్ అయ్యర్ కూడా రికార్డు స్థాయి ధర పలికాడు. పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయాస్ అయ్యర్ ను రూ. 26.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండో ఖరీదైన ప్లేయర్ గా శ్రేయాస్ నిలిచాడు.
ఐపీఎల్ జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు.. తొలిరోజు వేలంలో దక్కించుకున్న ఆటగాళ్లు వీరే..
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ..
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు : విరాట్ కోహ్లీ (21కోట్లు), రజత్ (11కోట్లు), యశ్ దయాల్ (5కోట్లు).
కొనుగోలు చేసిన ఆటగాళ్లు : హేజిల్ వుడ్ (12.50 కోట్లు), ఫిల్ సాల్ట్ (11.50కోట్లు), జితేశ్ (11 కోట్లు), లివింగ్ స్టన్ (8.75 కోట్లు), రసి్ సలాం (6కోట్లు), సుయాష్ (2.60కోట్లు).
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ..
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు : రుతురాజ్ గైక్వాడ్ (18కోట్లు), జడేజా (18కోట్లు), పతిరన (13కోట్లు), శివమ్ దూబె (12కోట్లు), ధోనీ (4కోట్లు).
కొనుగోలు చేసిన ఆటగాళ్లు : నూర్ అహ్మద్ (10కోట్లు), అశ్విన్ (9.75 కోట్లు), కాన్వే (6.25 కోట్లు), ఖలీల్ అహ్మద్ (4.80కోట్లు), రచిన్ రవీంద్ర (4కోట్లు), రాహుల్ త్రిపాఠి (3.40 కోట్లు), విజయ్ శంకర్ (1.20 కోట్లు).
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ..
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు : క్లాసెన్ (23కో్ట్లు), కమిన్స్ (18కోట్లు), అభిషేక్ (14కోట్లు), హెడ్ (14కోట్లు), నితీశ్ కుమార్ (6కోట్లు).
కొనుగోలు చేసిన ఆటగాళ్లు : ఇషాన్ కిషన్ (11.25 కోట్లు), మహ్మద్ షమి (10 కోట్లు), హర్షల్ (8కోట్లు), అభినవ్ (3.20 కోట్లు), రాహుల్ చాహర్ (3.20 కోట్లు), జంపా (2.40 కోట్లు), సిమర్ జీత్ (రూ.1.50కోట్లు), అథర్వ (రూ.30లక్షలు)
ముంబయి ఇండియన్స్ జట్టు ..
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు : జస్ర్పీత్ బుమ్రా (18కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (16.35 కోట్లు), హార్దిక్ పాండ్యా (16.35కోట్లు), రోహిత్ శర్మ (16.30 కోట్లు), తిలక్ వర్మ (8కోట్లు).
కొనుగోలు చేసిన ఆటగాళ్లు : ట్రెంట్ బౌల్ట్ (12.50కోట్లు), నమన్ ధీర్ (5.25 కోట్లు), రాబిన్ (65లక్షలు), కర్ణ్ శర్మ (50లక్షలు),
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ..
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు : రింకు సింగ్ (13కోట్లు), వరుణ్ (12 కోట్లు), నరైన్ (12కోట్లు), రసెల్ (12 కోట్లు), హర్షిత్ (4కోట్లు), రమణ్ దీప్ (4కోట్లు).
కొనుగోలు చేసిన ఆటగాళ్లు : వెంకటేశ్ అయ్యర్ (23.75కోట్లు), అన్రిచ్ నోకియా (6.50 కోట్లు), డికాక్ (3.60 కోట్లు), రఘువంశీ (3కోట్లు), గుర్బాజ్ (2కోట్లు), వైభవ్ (1.80కోట్లు), మయాంక్ మార్కండె (30లక్షలు).
రాజస్థాన్ రాయల్స్ జట్టు :
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: యశస్వీ జైస్వాల్ (18కోట్లు), శాంసన్ (18కోట్లు), పరాగ్ (14కోట్లు), ధ్రువ్ (14కోట్లు), హెట్ మయర్ (11కోట్లు), సందీప్ (4కోట్లు).
కొనుగోలు చేసిన ఆటగాళ్లు : అర్చన్ (12.50 కోట్లు), హసరంగ (5.25 కోట్లు), తీక్షణ (4.40 కోట్లు), ఆకాశ్ మధ్వాల్ (1.20 కోట్లు), కుమార్ కార్తీకేయ (30లక్షలు).
ఢిల్లీ క్యాపిటల్స్ ..
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు : అక్షర్ పటేల్ (16.50కోట్లు), కుల్దీప్ యాదవ్ (13.25కోట్లు), స్టబ్స్ (10కోట్లు), అభిషేక్ పోరెల్ (4కోట్లు).
కొనుగోలు చేసిన ఆటగాళ్లు : కేఎల్ రాహుల్ (14కోట్లు), స్టార్క్ (11.75కోట్లు), నటరాజన్ (10.75కోట్లు), ఫ్రెజర్ (9కోట్లు), హ్యారిబ్రూక్ (6.25కోట్లు), అశుతోష్ (3.80కోట్లు), మోహిత్ శర్మ (2.20 కోట్లు), సమీర్ రిజ్వీ (95లక్షలు), కరుణ్ నాయర్ (50లక్షలు).
పంజాబ్ కింగ్స్ జట్టు ..
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు : శశాంక్ సింగ్ (5.50 కోట్లు), ప్రభ్ సిమ్రాన్ (4కోట్లు).
కొనుగోలు చేసిన ఆటగాళ్లు : శ్రేయస్ అయ్యర్ (26.75కోట్లు), యుజ్వేంద్ర చాహల్ (18కోట్లు), అర్షదీప్ సింగ్(18కోట్లు), స్టాయినిస్ (11కోట్లు), నేహాల్ (4.20 కోట్లు), మ్యాక్స్ వెల్ (4.20 కోట్లు), వైశాఖ్ (1.80కోట్లు), యశ్ థాకూర్ (1.60కోట్లు), హర్ ప్రీత్ బ్రార్ (1.50కోట్లు), విష్ణు వినోద్ (95లక్షలు).
లక్నో సూపర్ జెయింట్స్..
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు : నికోలస్ పూరన్ (21కోట్లు), రవి బిష్ణోయ్ (11కోట్లు), మయాంక్ యాదవ్ (11 కోట్లు), మోసిన్ (4కోట్లు), బదోని (4కోట్లు).
కొనుగోలు చేసిన ఆటగాళ్లు : రిషబ్ పంత్ (27కోట్లు), ఆవేశ్ ఖాన్ (9.75కోట్లు), డేవిడ్ మిల్లర్ (7.50కోట్లు), అబ్దుల్ సమద్ (4.20కోట్లు), మిచెల్ మార్ష్ (3.40కోట్లు), మార్ క్రమ్ (2కోట్లు), ఆర్యన్ (30లక్షలు).
గుజరాత్ టైటాన్స్ ..
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు : రషీద్ ఖాన్ (18కోట్లు), శుభ్ మన్ గిల్ (16.50కోట్లు), సాయి సుదర్శన్ (8.50కోట్లు), తెవాటియా (4కోట్లు), షారుక్ ఖాన్ (4కోట్లు).
కొనుగోలు చేసిన ఆటగాళ్లు : జోస్ బట్లర్ (15.75కోట్లు), మహ్మద్ సిరాజ్ (12.25 కోట్లు), కగిసో రబాడ (10.75కోట్లు), ప్రసిద్ధ్ కృష్ణ (9.50 కోట్లు), మహిపాల్ లొమ్రోర్ (1.70కోట్లు), కుశాగ్ర (65లక్షలు), మానవ్ (30లక్షలు), అనుజ్ (30లక్షలు), నిశాంత్ (30లక్షలు).