Team India : గ‌త 10 ఏళ్ల‌లో భార‌త బౌల‌ర్ల చెత్త ప్ర‌ద‌ర్శ‌న ఇదే.. ఏకంగా 500 ర‌న్స్‌..

మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు విఫ‌లం అయ్యారు.

India concede 500 overseas for the first time in 10 years

మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు విఫ‌లం అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశ‌గా ప‌య‌నిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లాండ్ 7 వికెట్ల న‌ష్టానికి 544 ప‌రుగులు చేసింది. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టు ఓ చెత్త రికార్డును మూట గ‌ట్ట‌నుకుంది.

ఓవర్‌సీస్ కండిషన్స్‌లో గత 10 ఏళ్లలో భార‌త జ‌ట్టు ప్ర‌త్య‌ర్థికి 500 ప్లస్ రన్స్‌ను స‌మ‌ర్పించుకోవ‌డం ఇదే తొలిసారి. చివ‌రి సారిగా 2015లో విదేశాల్లో భార‌త్ 500 ఫ్ల‌స్ ర‌న్స్ ఇచ్చింది. సిడ్నీ వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 572 ర‌న్స్ చేసింది. కాగా.. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ త‌రువాత ఇన్నేళ్ల త‌రువాత ఇంగ్లాండ్‌కు 500 ఫ్ల‌స్ ర‌న్స్ ఇచ్చింది భార‌త్‌.

ENG vs IND : వర్షం శుభ్‌మన్ గిల్ సేన‌ను కాపాడుతుందా? మాంచెస్టర్‌లో నాలుగో రోజు వాతావ‌ర‌ణ నివేదిక ఇదే..

ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 358 ప‌రుగులు చేసింది. అనంత‌రం జో రూట్(248 బంతుల్లో 150 ప‌రుగులు) భారీ శతకం బాదడంతో పాటు ఓలీ పోప్ ( 71), బెన్ స్టోక్స్( 77 నాటౌట్) హాఫ్ సెంచ‌రీలు చేయ‌డంతో మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 135 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 544 ప‌రుగులు చేసింది.

టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, బమ్రా, అన్షుల్ కంబోజ్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ 186 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు విజయవకాశాలు సన్నగిల్లాయి. సిరీస్ కోల్పోకూడ‌దు అనుకుంటే డ్రా చేసుకోవడం మినహా టీమ్ఇండియా ముందు మార్గం లేదు.