ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోంది. న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. వన్డేల్లో భారత జట్టు టాస్ ఓడిపోవడం ఇది 15వ సారి. అటు కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు. ఈ క్రమంలో అతడు బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా సైతం వరుసగా 12 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయాడు.
భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. పిచ్ నలుగురు స్పిన్నర్లకు సహకరిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కివీస్ తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో గాయపడన పేసర్ మాట్ హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్ జట్టులోకి వచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లు వీరే.
బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 12 సార్లు (అక్టోబర్ 1998 నుంచి మే 1999 వరకు)
రోహిత్ శర్మ (భారత్) – 12 సార్లు (నవంబర్ 2023 నుంచి మార్చి 2025 వరకు )
పీటర్ బోరెన్ (నెదర్లాండ్స్) – 11 సార్లు (మార్చి 2011 నుంచి ఆగస్టు 2013 వరకు)
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
Virat Kohli : న్యూజిలాండ్‌తో ఫైనల్‌కు ముందు కోహ్లిని ఊరిస్తున్న పలు రికార్డులు ఇవే..
న్యూజిలాండ్ తుది జట్టు..
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జేమిసన్, విలియం ఓరూర్కే