India Mens U19 Squad Announced for Australia tour
సెప్టెంబర్‌లో భారత అండర్-19 పురుషుల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఈ పర్యటనలో పాల్గొనే జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆయుష్ మాత్రే నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. ఈ జట్టులో 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది.
“సెప్టెంబర్‌లో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం జూనియర్ సెలక్షన్ కమిటీ భారత U19 జట్టును ఎంపిక చేసింది. భారత U19 జట్టు ఆస్ట్రేలియా U19 జట్టుతో మూడు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్‌లు ఆడుతుంది” అని బీసీసీఐ కార్యదర్శి దేవజోత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు.
WCL 2025 : డబ్ల్యూసీఎల్ టోర్నీ నుంచి భారత్ వాకౌట్.. ఫైనల్‌కు పాక్..
తొలుత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 21న తొలి వన్డే, 24న రెండో వన్డే, 26న మూడో వన్డే జరగనుంది. మల్టీ డే మ్యాచ్‌లు సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మల్టీ డే మ్యాచ్ సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు , రెండో మల్టీ డే మ్యాచ్ అక్టోబర్ 7 నుంచి 10 వరకు జరగనున్నాయి.
🚨 NEWS 🚨
India U19 squad for tour of Australia announced.
The India U19 side will play three one-day games and two multi-day matches against Australia’s U19 side.
Details 🔽 #TeamIndiahttps://t.co/osIWOaFA12
— BCCI (@BCCI) July 30, 2025
ఆస్ట్రేలియా పర్యటన కోసం మొత్తం 17 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. మరో ఐదుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైలో ఉంచారు.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత అండర్-19 జట్టు ఇదే..
ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్పక్, హెనిల్, కిషన్, కిషన్, ఉన్ దీప్, పటేల్, కిషన్ కుమార్, పట్లేష్ మోహన్, అమన్ చౌహాన్.
స్టాండ్‌బై ప్లేయర్‌లు..
యుధాజిత్ గుహ, లక్ష్మణ్, బికె కిషోర్, అలంక్రిత్ రాపోల్, అర్నవ్ బుగ్గ.