Ind vs Ban 2nd Test Match: కష్టాల్లో టీమిండియా.. 45 పరుగులకే కుప్పకూలిన టాప్ ఆర్డర్.. ఇరు జట్లకు విజయావకాశాలు ..

భారత్ - బంగ్లా‌దేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ముగింపు దశకు చేరుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇరు జట్లకు విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆదివారం నాల్గోరోజు ఆటలో రెండో టెస్టు మ్యాచ్ లో గెలిచేది ఎవరో తేలిపోతుంది. మూడోరోజు ఆటలో బౌలర్ల హవా సాగింది.

Ind vs Ban 2nd Test Match: భారత్ – బంగ్లా‌దేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ముగింపు దశకు చేరుకుంది. మూడు రోజుల ఆట ముగిసే సమయానికి ఇరు జట్లకు విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆదివారం నాల్గోరోజు ఆటలో రెండో టెస్టు మ్యాచ్ లో గెలిచేది ఎవరో తేలిపోతుంది. మూడోరోజు ఆటలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. కానీ చివరిలో బ్యాటర్లు చేతులెత్తేయడంతో తక్కువ పరుగులకే నలుగురు కీలక బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. ఇక టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా వంద పరుగులు చేయాల్సి ఉంది. ఆరు వికెట్లు ఉన్నాయి. మరి వంద పరుగులు చేస్తుందా? లక్ష్యం చేరకుండానే ఆరు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ జట్టుకు విజయాన్ని అందిస్తుందా అనేది రేపు తేలుతుంది.

Rishabh Pant: వ్యక్తిగత రికార్డులను నేను పట్టించుకోను.. కీలక వ్యాఖ్యలు చేసిన రిషబ్ పంత్

భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్‌లోని మీర్పూర్ స్టేడియంలో జరుగుతుంది. మూడోరోజు ఆటలో భాగంగా.. బంగ్లా జట్టు రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఓవర్ నైట్ స్కోరు ఆరు పరుగులతో నజ్మల్, జాకిర్ క్రిజ్ లోకి వచ్చారు. మూడో రోజు తొలి ఓవర్ నుంచి టీమిండియా బౌలర్లదే ఆధిపత్యం సాగింది. తక్కువ స్కోర్ కే బంగ్లా బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. భారత్ బౌలర్ల దాటికి 231 పరుగులకే బంగ్లాదేశ్ జట్టు ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్ (73), జాకిర్ హసన్ (51) పరుగులు మినహా మిగిలిన వారు ఎవరూ రాణించలేదు.

Bangladesh vs India: రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే బంగ్లా ఆలౌట్.. ఆదిలోనే వికెట్ కోల్పోయిన భారత్

145 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియాకు వరుస ఎదురుదెబ్బలు తగిలిగాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 45 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ స్పిన్నర్ల దాటికి కీలక ఆటగాళ్లు నిమిషాల వ్యవధిలోనే పెవిలియన్ దారిపట్టారు. బంగ్లా బౌలర్ మెహిదీ హసన్ దెబ్బకు టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్లుగా క్రిజ్ లోకి వచ్చిన రాహుల్ (2), శుభ్‌మన్ గిల్ (7)లు త్వరగా పెవిలియన్ బాటపట్టారు. ఆ తరువాత వచ్చిన ఛతేశ్వర్ పుజారా (6), విరాట్ కోహ్లీ (1) వెంటవెంటనే అవుట్ కావటంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ప్రస్తుతం అక్షర్ పటేల్ (26), జయ్‌దేవ్ ఉనద్కత్ (3) క్రిజ్ లో ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 100 పరుగులు చేయాలి. అదే బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించాలంటే ఆరు వికెట్లు తీయాల్సి ఉంటుంది. మరో రెండు రోజులు సమయం ఉన్నప్పటికీ రేపు జరిగే నాల్గోరోజు ఆటతో విజయం ఎవరివైపు నిలుస్తుందో తేలిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు