IND vs BAN : రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఆలౌట్‌.. భార‌త విజ‌య‌ల‌క్ష్యం ఎంతంటే..?

కాన్పూర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచులో భార‌త్ విజ‌యం దిశ‌గా సాగుతోంది.

IND vs BAN 2nd Test

కాన్పూర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచులో భార‌త్ విజ‌యం దిశ‌గా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 146 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో భార‌త్ ముందు 95 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యం నిలిచింది. మ్యాచ్‌కు నేడే చివ‌రి రోజు. మ‌రో రెండు సెష‌న్లు ఆట మిగిలి ఉంది. సుమారు 62 ఓవ‌ర్ల‌లో భార‌త్ 95 ప‌రుగులు సాధిస్తే సిరీస్ క్లీన్‌స్వీప్ అవుతుంది. ఏదైన మ‌హాద్భుతం జ‌రిగితే త‌ప్ప బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోవ‌డం ఖాయం.

ఓవ‌ర్ నైట్ స్కోరు రెండు వికెట్ల న‌ష్టానికి 26 ప‌రుగుల‌తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన బంగ్లాదేశ్ మ‌రో 120 ప‌రుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్ల‌ను కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట‌ర్ల‌లో షాద్మాన్ ఇస్లాం (50) అర్థ‌శ‌త‌కంతో రాణించాడు.

Sunil Gavaskar : టీ20 త‌ర‌హాలో రెండో టెస్టులో భార‌త్ బ్యాటింగ్‌.. అసంతృప్తిగా ఉన్న గ‌వాస్క‌ర్‌.. 9 వేల ప‌రుగులు..

జాకీర్ హ‌స‌న్ (10), నజ్ముల్ హుస్సేన్ శాంటో (19), ముష్ఫికర్ రహీమ్ (37) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజాలు త‌లా మూడు వికెట్లు తీశారు. ఆకాశ్ దీప్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.