Sunil Gavaskar : టీ20 తరహాలో రెండో టెస్టులో భారత్ బ్యాటింగ్.. అసంతృప్తిగా ఉన్న గవాస్కర్.. 9 వేల పరుగులు..
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.

Sunil Gavaskar Not Happy With India's Tactic vs Bangladesh
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. వర్షం కారణంగా రెండు రోజుల ఆట పూర్తిగా రద్దు అయినప్పటికి మ్యాచ్ ఫలితం దిశగా సాగుతోంది. నాలుగో రోజు ఆటలో తొలుత బంగ్లాదేశ్‌ను 233 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ ఆ తరువాత టీ20 తరహా ఆట తీరును ప్రదర్శించింది. ప్రతి బ్యాటర్ దూకుడుగా ఆడారు.
రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ఇండియా 34.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు కీలకమైన 52 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కాగా.. బ్యాటర్ల దూకుడు కారణంగా టెస్టు క్రికెట్ చరిత్రలో టీమ్ ఇండియా అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులను నమోదు చేసిన జట్టుగా నిలిచింది.
అయితే.. భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసినప్పటికి టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ జట్టు బ్యాటింగ్ లైనప్ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. జియో సినిమాలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
భారత ఇన్నింగ్స్‌లో రెండో వికెట్‌గా యశస్వి జైస్వాల్ ఔట్ అయినప్పుడు నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వస్తాడని ఎంతో మంది ఎదురుచూశారు. అయితే.. అందరిని ఆశ్చర్యపరిచే విధంగా రిషబ్ పంత్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ ముందు పంపింది. ఆ తరువాత ఐదో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చాడు.
Musheer Khan : యాక్సిడెంట్ తరువాత తొలిసారి మాట్లాడిన ముషీర్ ఖాన్.. మెడకు పట్టీ పెట్టుకుని..
టెస్టు క్రికెట్‌లో 9 వేలకు పైగా పరుగులు చేసిన కోహ్లీని నాలుగో స్థానంలోనే పంపాల్సింది అని గవాస్కర్ అన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన పంత్ 11 బంతులను ఎదుర్కొని 9 పరుగులు చేయగా, ఐదో స్థానంలో వచ్చిన కోహ్లీ 35 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ బాది 47 పరుగులు సాధించాడు.
ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు కోహ్లీ. ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 623 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా విరాట్ కేవలం 594 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.