India Squad Announced for ICC Champions Trophy 2025
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. హైబ్రిడ్ మోడ్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు. 15 మందితో కూడిన టీమ్‌ను ఎంపిక చేశారు. అయితే.. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకున్నారు.
ఇక ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఇదే జట్టు కొనసాగుతుందని బీసీసీఐ వెల్లడించింది. ఇంగ్లాండ్‌తో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
Virat Kohli – KL Rahul : రంజీ మ్యాచులకు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు దూరం?
ఇక ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే.. మొత్తం 8 దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్ తో పాటు పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూపు-ఏలో ఉన్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. మార్చి 2న భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది.
ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచులు అన్నీ దుబాయ్‌లో జరగనున్నాయి. ధోని సారథ్యంలో భారత్ 2013లో చివరి సారిగా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
Megastar Chiranjeevi : షార్జా స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి సందడి.. వీడియో
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌గిల్ (వైస్‌కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్,రవీంద్ర జడేజా.
INDIA’S SQUAD FOR CHAMPIONS TROPHY AND ENGLAND ODI SERIES:
Rohit (C), Gill (VC), Kohli, Iyer, KL Rahul, Hardik, Axar, Sundar, Kuldeep, Bumrah*, Shami, Arshdeep, Jaiswal, Pant and Jadeja.
*Harshit Rana will play the ODI series. pic.twitter.com/rbKwiDpLAF
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 18, 2025