Virat Kohli – KL Rahul : రంజీ మ్యాచులకు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు దూరం?
టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవాలంటే స్టార్ క్రికెటర్లు అయినా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఓ రూల్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

Virat Kohli and KL Rahul To Miss Ranji Trophy Matches Report
టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవాలంటే స్టార్ క్రికెటర్లు అయినా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఓ రూల్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలతో పాటు యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు జనవరి 23 నుంచి ప్రారంభం కానున్న రంజీట్రోఫీ బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే.. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు మాత్రం రంజీ మ్యాచ్ ఆడడం లేదని వార్తలు వస్తున్నాయి.
ఈ విషయాన్ని ఇప్పటికే వారిద్దరు బీసీసీఐకి తెలియజేశారని అంటున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ మెడ నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడే కోహ్లీ మెడ పట్టేసిందని, దానికి అతడు ఇంజెక్షన్లు కూడా వాడుతున్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
U-19 Womens T20 World Cup : నేటి నుంచి మహిళల అండర్-19 ప్రపంచకప్
ఇంగ్లాండ్‌తో వన్డే, ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో తాను కోలుకునేందుకు సమయం కావాలని, ఈ క్రమంలోనే రంజీ మ్యాచ్ ఆడలేనని కోహ్లీ బీసీసీఐకి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
రంజీ మ్యాచులో కర్ణాటక తరుపున కేఎల్ రాహుల్ ఆడతాడని అంతా భావించారు. అయితే.. మోచేతి గాయం కారణంగా తాను అందుబాటులో ఉండనని రాహుల్ బీసీసీఐకి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటక జట్టు అతడిని పక్కన బెట్టింది. గిల్ పంజాబ్ తరుపున, రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరుపున, రిషబ్ పంత్ ఢిల్లీ తరుపున బరిలోకి దిగనున్నారు.
Megastar Chiranjeevi : షార్జా స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి సందడి.. వీడియో
గాయాలతో బాధపడుతుండడంతో తాము రంజీ మ్యాచులు ఆడలేమని విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు చేసిన అభ్యర్థనను బీసీసీఐ అంగీకరించిందని రిపోర్టులు చెబుతున్నాయి.
Virat Kohli (neck pain) and KL Rahul (elbow issues) are unavailable for the next round of Ranji Trophy starting from 23rd January. (Espncricinfo). pic.twitter.com/2qXOSeyqXN
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 18, 2025