India T20 World Cup 2026 Squad Shubman Gill Snubbed Ajit Agarkar Comments
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది ప్లేయర్లకు ఈ జట్టులో చోటు ఇచ్చింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత్ బరిలోకి దిగనుండగా అతడి డిప్యూటీగా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. ఇక ఆశ్చర్యకరంగా శుభ్‌మన్ గిల్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. అదే సమయలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పరుగుల వరద పారించిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు దాదాపు రెండేళ్ల తరువాత జాతీయ జట్టులో చోటు దక్కింది.
జట్టు ఎంపిక పై అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడాడు.’ శుభ్‌మన్ గిల్ నాణ్యమైన ఆటగాడు. అయితే.. ప్రస్తుతం అతడు పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. మా దృష్టిలో అతడు ఎప్పుడూ ఉంటాడు. అతడి కంటే సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు ఉండడంతో దురదృష్ట వశాత్తు అతడికి చోటు దక్కలేదు.’అని అగార్కర్ అన్నాడు
‘మేము కాంబినేషన్ల కోసం చూస్తున్నాము. మరో వికెట్ కీపర్ ఉండాలని అనుకున్నాము. ప్రస్తుతం ఇషాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గతంలో భారత్ తరుపున ఎన్నో మ్యాచ్‌లను అతడు గెలిపించాడు. రేసులో పంత్, జురెల్‌లు ఉన్నారు. అయినప్పటికి కూడా సంజూ శాంసన్‌కు బ్యాకర్ కీపర్‌గా ప్రస్తుతం ఇషాన్ బెస్ట్ ఛాయిస్ అని అనుకున్నాము. ‘అని అగార్కర్ అన్నాడు.
ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 జరగనుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈమెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగాటోర్నీలో భారత జట్టు తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న యూఎస్‌ఏతో తలపడనుంది. ఆ తరువాత ఫిబ్రవరి 12న నమీబియాతో ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా మ్యాచ్ జరగనుంది.
AUS vs ENG : 228 రన్స్.. 4 వికెట్లు.. ఇంగ్లాండ్‌కు మరో ఓటమేనా..
గ్రూప్ స్టేజీలో చివరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. ఫిబ్రవరి 21 నుంచి, మార్చి 1 వరకు సూపర్ 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 4న మొదటి సెమీఫైనల్, మార్చి 5న రెండో సెమీఫైనల్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరగనుంది.